లో బ్లడ్ ప్రెషర్ కి ముఖ్య కారణాలు

అతివృష్టి, అనావృష్టి .రెండూ ప్రమాదకరమే.

అదేరకంగా హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ .రెండూ ప్రాణానికి ముప్పే.లో బిపి వలన ఏ పని సరిగా చేయలేం.

ఊరికే అలసిపోవడం, మూర్ఛపోవడం లాంటివి తరుచుగా జరుగుతుంటాయి.మరీ ఈ లో బీపి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా ! * మీరు రోజు తినే ఆహరంలో సరైన పోషకాలు, న్యూట్రెంట్స్ లేకపోతే లో బిపి వస్తుంది.

విటమిన్ B-12 మరియు ఫోలేట్ సరైన మోతాదులో శరీరానికి అందాలి.లేదంటే అవసరానికి తగ్గట్టుగా రెడ్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేయలేకపోతుంది శరీరం.

Advertisement

ఈ కారణంతో బిపి డౌన్ అయిపోతుంది.* ఏదైనా తీవ్రమైన గాయం వలన రక్తం మరీ ఎక్కువగా బయటపడితే ప్రమాదం.

శరీరంలో సరిపడ రక్తం లేకపోవడంతో లో బీపి వస్తుంది.* ఇంఫెక్షన్స్ శరీరానికి బలంగా తాకితే, దాన్ని సెప్టిసిమియా అని అంటారు.

ఇలాంటి పరిస్థితులలో బ్లడ్ ప్రెషర్ ప్రాణాంతకంగా డవున్ అయిపోతుంది.* నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్నా, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది.

అందుకే నీళ్ళు బాగా తాగాలి.* హైపోథైరాడిజమ్, హైపర్ థైరాడిజమ్ వంటి థైరాడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లో బిపి వస్తుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ముప్పై రోజుల్లో మీ జుట్టును ఒత్తుగా, పొడుగ్గా మార్చే సూప‌ర్ రెమెడీస్‌ ఇవే!

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువున్నా, ఎక్కువున్నా బ్లడ్ ప్రెషర్ కి కష్టమే.* బ్రాడికార్డియా లాంటి గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది.

Advertisement

* ఇక గర్భిణీ స్త్రీలకు కూడా లో బిపి సమస్యలు వస్తాయి.

తాజా వార్తలు