మార్చి 6 వరకు పోలీస్ 30యాక్ట్ అమలు: పోలీసు కమిషనర్

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీ నుండి 2023 మార్చి 6 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు.

 Implementation Of Police 30act Till March 6 .commissioner Of Police , Commission-TeluguStop.com

ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు .ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

DJ లకు అనుమతి లేదు నివాస, వాణిజ్య ప్రాంతాలలో,బహిరంగ ప్రదేశాలలో పగటి, రాత్రి సమయాలలో పరిమితులకు మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్న DJ లతో ఊరేగింపులు చేస్తూ.

పిల్లలు, వృద్ధులు, రోగులు మరియు విద్యార్థులు,సాదారణ ప్రజలకు,తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న DJ లకు అనుమతి లేదని తెలిపారు.ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్, 2016 ఐపిసి 188 మరియు U/S 76 శిక్షకు బాధ్యత వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube