పెద్దపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.
ఐదేళ్ల క్రితం మహిళకు ప్రైవేట్ డాక్టర్ డెలివరీ చేసాడు.అప్పటి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతుంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చెక్ చేయించుకుంది.దీంతో షాకింగ్ విషయం తెలిసింది.
ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.గతంలో డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసిన డాక్టర్… ఆమె కడుపులో కత్తెరను మర్చిపోవడంతో కడుపునొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.