రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. అసలు విషయం చెప్పిన బిగ్ బాస్ మానస్

టాలీవుడ్ ప్రేక్షకులకు బుల్లితెర, వెండితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ గురించి అందరికీ పరిచయమే.

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా విపరీతమైన ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం మానస్ పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.

మానస్ మొదటిసారి నరసింహ నాయుడు సినిమా బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.ఆ పై వచ్చిన వీడే, అర్జున్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత రవి శర్మ దర్శకత్వంలో వచ్చిన ఝలక్ లో ప్రధాన నటుడుగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Advertisement

అలా గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, గోలీసోడా వంటి చిత్రాల్లో తన నటనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.కేవలం వెండితెరపై కాకుండా బుల్లితెరలో కూడా కోయిలమ్మ సీరియల్ లో నటించి ఆ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు.బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పరిచయం పెంచుకుని మరిన్ని అవకాశాల తో ముందుకు దూసుకుపోతున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మానస్ ఎంతో సహనంతో తన ఆటను ఆడాడు.నిజానికి నెగిటివిటీ ముద్రను కూడా మోయలేదని చెప్పాలి.ముఖ్యంగా మరో కంటెస్టెంట్ ప్రియాంక తో తన మూవింగ్ ఎలా ఉందో చూసాం.

ప్రియాంక తన మాయలో పడగా తను మాత్రం ప్రత్యేక యాటిట్యూడ్ తో ప్రియాంక ను హ్యాండిల్ చేశాడు.

కానీ వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నిజమైతే బాగుండు అని కొందరు ప్రేక్షకులు కూడా అనుకున్నారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మానస్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా ప్రియాంకతో తనకున్న స్నేహం గురించి చెప్పిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి సినిమాలు తీయాలని ఉందంటూ తన కోరికను కూడా తెలిపాడు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ప్రస్తుతం మానస్ ఆ పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక మానస్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

Advertisement

తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలు బాగా పంచుకుంటాడు.అప్పుడప్పుడు అభిమానులతో కూడా బాగా ముచ్చటిస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు.

అందులో తన అభిమానులు తన గురించి అడగవలసిన ప్రశ్నలు అడిగారు.ఇక ఓ అభిమాని తనను. రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడగటం తో అవును అని అన్నాడు.

అది కూడా తన అభిమానులతో, తన మంచి కోరుకునే వాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాను అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు.ఇక ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు