నా శరీరంలో నడుమునే ఎందుకు చూపిస్తున్నారు.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఇలియానా( ileana ) ఒకరు కాగా ఇలియానా నటించిన చాలా సినిమాల్లో దర్శకులు ఆమె నడుముపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

అప్పట్లోనే ఇలియానా కోటి రూపాయల రెమ్యునరేషన్ ను అందుకోగా ఆమెకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే.

నా శరీరంలో నడుమునే ఎందుకు చూపిస్తున్నారని ఇలియానా ఒక సందర్బంలో కామెంట్లు చేశారు.ఇలియానా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ప్రతి సినిమాలో నా నడుము భాగంపై దృష్టి పెట్టడం విషయంలో ఇలియానా అభ్యంతరం తెలియజేశారు.తాను చాలా బాధ పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

చాలాసార్లు తెరపై అలా చూసినందుకు ఇబ్బందిగా అనిపించిందని ఇలియానా వెల్లడించడం గమనార్హం.

Advertisement

ఇకపై నన్ను అలా చూపించొద్దని కొంతమంది దర్శకులకు( directors ) సూచనలు కూడా చేశానని ఆమె పేర్కొన్నారు.నా నడుమును చూస్తే సన్నగా బాగుంది కదా అని అనిపిస్తుందని ఇలియానా వెల్లడించారు.కానీ నా నడుమును రాంగ్ వేలో చూపించినప్పుడు బాధ కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

నేను ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటానని ఇలియానా వెల్లడించడం గమనార్హం.

ఇళ్లు ఊడ్చటం, వంటలు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తానని ఇలియానా చెప్పుకొచ్చారు.ఇలియానా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇలియానా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇలియానా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా తక్కువని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలియానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

1000 మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు ప్రభాస్.. శ్యామలాదేవి కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు