పవిత్రమైన కార్తీకమాసంలో శివ కేశవులను పూజిస్తే.. ఇన్ని పుణ్య ఫలితాలు లభిస్తాయా..?

తెలుగు మాసాలలో ఎన్నో పవిత్రమైన మాసాలు ఉన్నాయని దాదాపు చాలామందికి తెలుసు.

అందులోనీ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు,నోములు ఇలా సౌభాగ్యాలు కలిగించే గౌరీదేవి, సిరిసంపదలు ప్రసాదించే లక్ష్మీదేవి( lakshmi devi ) పూజలకు ఈ మాసం ఎంతో ప్రసిద్ధి చెందింది.

కానీ కార్తీక మాసం మాత్రం గౌరీదేవి, లక్ష్మీదేవిల పతులు అయిన శివ కేశవులకు ఎంతో ఇష్టమైన మాసం.ఈ కార్తీక మాసం అంతా శివాలయాలు, విష్ణు దేవాలయాలలో ఆధ్యాత్మిక భావనతో మారుమోగిపోతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే అభిషేక ప్రియుడైన శివయ్యకు అభిషేకాలు, అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువు( Lord vishnu )కు సర్వలంకారాలతో పాటు విశిష్ట పూజలు జరుగుతాయి.

అలాగే శివకేశవులకు అత్యంత ఇష్టమైన ఈ కార్తిక మాసం అంతా ప్రతిరోజు ఆధ్మాకతతో నిండి ఉంటుంది.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మహిళలు కార్తీక స్నానాలు, దీపాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక భావనలతో బిజీగా ఉంటారు.ప్రతి ఇల్లు దూప కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది.

Advertisement

గుమ్మానికి మామిడి తోరణాలు, పచ్చని పసుపు,ముచ్చటైన ముగ్గులతో గడపలు,గుమ్మాలు వెలిగిపోతు ఉంటాయి.పూజలు చేసిన మహిళలు ఉపవాసాలతో శివకేశవులను ధ్యానిస్తారు.

అలాగే పురాణాలు చదువుతూ ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటారు.బ్రహ్మ ముహూర్తాలలో నిద్ర లేచి చల్ల నీటితో స్నానాలు చేసి కార్తిక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.

ఇంకా చెప్పాలంటే దేవాలయాలకు వెళ్లి శివ కేశవులను భక్తితో పూజిస్తారు.దాన ధర్మాలు చేసి కుటుంబానికి మంచి జరగాలని, భర్త, పిల్లలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని శివకేశవులను పూజిస్తారు.కార్తీకమాసంలో శివాలయానికి వెళ్లి ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేస్తే కోటి పుణ్య పలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలా చేసిన వారికి మోక్షం కూడా కలుగుతుందని శివపురాణం( Shiva Purana )లో ఉంది.పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.కార్తీక మాసంలో శివకేశవులను పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో ఉంది.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!
Advertisement

తాజా వార్తలు