ఏదైనా దేశానికి మనం వెళ్లాలంటే అక్కడి నిబంధనలను ముందుగా తెలుసుకోవాలి.అక్కడ ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి.
ఎలాంటి పద్దతులు పాటిస్తారు లాంటి అన్ని నియమాలను ముందుగానే తెలుసుకోవాలి.అసలు ఏమీ తెలుసుకోకుండా వెళితే అక్కడ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
అలాగే చాలామంది మధ్యవర్తులను నమ్మి మోసపోతున్నారు.డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తున్నారు.
కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా కెనడా( Canada ) వెళ్లిన కొంతమంది భారతీయులు( Indians ) అక్కడ మోసపోయారు.మెసపోయిన విద్యార్థులు సీబీఎస్ఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.ఇండియా నుంచి చాలామంది కెనడాకు వెళుతూ ఉంటారు.
ఏజెన్సీల ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ డాక్యుమెంట్స్, కాలేజీలో అడ్మిషన్ వచ్చిందని ఆశ పడి వెళతారు.కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అడ్మిషన్లు, సర్టిఫికేట్లు ఫేక్ అని తెలిస్తే అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
దీంతో కెనడా నుంచి చాలామంది భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు.
ఇటీవల మొత్తం 700 మంది విద్యార్థులు ఫేక్ సర్టిఫికేట్లతో( fake certificates ) అడ్మిషన్లు పొందినట్లు తేలింది .దీంతో వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని కెనడా సూచించింది.దీంతో విద్యార్థులు అక్కడ నిరసనలు చేపడుతున్నారు.
దీంతో అక్కడి ప్రభుత్వం స్పందించింది.విద్యార్థులు తమ వాదన చెప్పుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తామని, ప్రతి కేసును సమీక్షిస్తామని తెలిపారు.
సమీక్షించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో స్పష్టం చేశారు.విద్యార్థుల్లో చాలామంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు.
ఈ బాధితులందరూ జలంధర్‌కు చెందిన బృజేశ్ మిశ్రాను ఆశ్రయించి కెనడా వెళ్లినట్లు తెలుస్తోంది.ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీస్ పేరును అతడు ఒక కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఫేక్ డాక్యుమెంట్ల కేసులో గతంలో అతడు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.