కివీ ఫ్రూట్‌ను ఇలా తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గొచ్చట‌!

ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన పండ్ల‌లో కివీ ఫ్రూట్ ఖ‌చ్చితంగా ఉంటుంది.చ‌ల్ల‌గా ఉండే ప్ర‌దేశాల్లో వీటిని పండిస్తారు.

చూపురుల‌కు స‌పోటా పండు మాదిరి క‌నిపించినా.ప్ర‌త్యేక‌మైన రుచిని కివీ పండు క‌లిగి ఉంటుంది.

అలాగే విటమిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం కివీ పండు.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇది అనూహ్య‌మైన లాభాల‌ను చేకూరుస్తుంది.

ముఖ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నించే వారికి కివీ పండు ఓ వ‌రం అని అంటుంటారు.అవును, ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా కివీ ఫ్రూట్‌ను తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవ్వచ్చు.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కివీని ఎలా తింటే బ‌రువు త‌గ్గుతారో చూసేయండి.రెండు కివీ పండ్ల‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక యాపిల్‌ను తీసుకుని వాట‌ర్‌తో వాష్ చేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ స‌న్ ఫ్లెవ‌ర్ సీడ్స్‌, క‌ట్ చేసి పెట్టుకున్న కివీ పండు ముక్క‌లు, యాపిల్ ముక్క‌లు, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, రెండ టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కివీ స్మూతీ సిద్ధం అవుతుంది.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ స్మూతీని ఉద‌యం బ్రేక్ స‌మ‌యంలో తీసుకోవాలి.త‌ద్వారా కివీ పండులో ఉండే ప‌లు పోష‌కాలు శరీరంలో కొవ్వుని పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

అదేస‌మ‌యంలో మెటబాలిజం రేటును పెంచి క్యాల‌రీలు క‌రిగే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తాయి.దాంతో త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

పైగా ఈ కివీ స్మూతీని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అతి ఆక‌లి స‌మ‌స్య దూరం అవుతుంది.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

Advertisement

బ‌లహీన‌మైన ఎముక‌లు బ‌లంగా మార‌తాయి.మ‌రియు కంటి చూపు కూడా పెరుగుతుంది.

కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారే కాదు ఎవ్వ‌రైనా ఈ స్మూతీని తీసుకోవ‌చ్చు.

తాజా వార్తలు