చెట్టుపై పండు కింద పడటానికి ఈ గుర్రం ఎంత తెలివైన పనిచేస్తుందో చూస్తే..

గుర్రాలు( Horses ) చాలా తెలివైన జంతువులు.ఇవి వాటి శరీర పరిమాణంతో పోల్చితే పెద్ద మెదడును కలిగి ఉంటాయి.

 If You See How Clever This Horse Works To Make The Fruit Fall From The Tree ,vi-TeluguStop.com

ఇవి క్లిష్టమైన పనులను నేర్చుకోగల, గుర్తుంచుకోగల జీవులు.గుర్రాలు ఒకదానితో ఒకటి, మానవులతో కూడా కమ్యూనికేట్ కాగలవు.

అంతేకాకుండా అవి తమకు కావాల్సినవి పొందేందుకు చాలా తెలివిగా కూడా ప్లాన్స్ రచిస్తాయి.తాజాగా ఒక గుర్రం చెట్టు పై( Tree ) నుంచి పండును కిందకు పడేసేందుకు ఒక తెలివైన పనిచేసింది.

అదేంటంటే అది తన శరీర వెనుక భాగాన్ని చెట్టుకు బలంగా గుద్దుతూ చెట్టు ఊగేలా చేసింది.అలా పండిన పండు( Fruit )ను కింద పడేసేందుకు ట్రై చేసింది.అలా ట్రై చేస్తూ చివరకు ఒక పండును కింద పడేయగలిగింది అనంతరం దాన్ని తినేసింది.ఆ తర్వాత మళ్లీ అదే ట్రిక్ ప్రయోగించి ఇంకొక పండును కింద పడేసి తినేసింది.

దీనిని ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు.ఆ వీడియోను @gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.https://twitter.com/gunsnrosesgirl3/status/1729594032387457284?t=-Lylcrub_afaaT4X2WSOQA&s=19 ఈ లింక్ విజిట్ చేయడం ద్వారా వీడియో చూడవచ్చు.

ఈ వీడియో చూసిన చాలామంది ఈ గుర్రం ఫుడ్ పొందేందుకు చాలా తెలివైన మార్గాలను అన్వేషిస్తుంది.ఇది సూపర్ అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.గుర్రాలలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని మరికొందరు అన్నారు.

ఇదొక బ్రిలియంట్ హార్స్ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.ఇకపోతే పడుకొని మాత్రమే కాకుండా నిల్చని కూడా నిద్రపోగలవు.

వాటి కాళ్లలో స్టే ఆపరేటర్స్ అనే ఒక ప్రత్యేక సదుపాయం ఉంటుంది.వాటి వల్ల అవి కాళ్ళను లాక్ చేసుకుని కింద పడిపోకుండా నిద్రపోగలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube