చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తిచూస్తే కాలిపోతారని జనసేన అధినేత, ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మీరు లక్షల కోట్ల సంపాదించొచ్చు మేము అడుక్కు తినాలా చిత్రపరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి ఏపీలో థియేటర్లు తెరవడం లేదు అన్నారు.చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం తీరు మారకుంటే ఎలా మార్చాలో తమకు తెలుసన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీలో థియేటర్లను ఇబ్బంది పెడుతుందని భారతదేశ పౌరులు హక్కు ఇదని, చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం లేదన్నారు.చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా తీసేవాళ్ళు ధైర్యంగా మాట్లాడాలని బయటకు రావాలన్నారు.
అధికారంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని అధికారం ఉందని విచక్షణారహితంగా వ్యవహరించలవద్దన్నారు.
నేను జీవితంలో విసిగిపోయి వాడికి వంగి వీడికి వంగి ఇంక ఎందరి దగ్గర వంగాలి ఇంకా ఎవరికీ వంగే ప్రసక్తే లేదుప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు తీస్తే ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేస్తాననడం ఏంటి ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా.
చిత్రపరిశ్రమ జోలికొస్తే అందరూ ఏకం అవ్వాలి అని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ మీద కోపంతో సినిమా ఆపేస్తే సినిమా మీద బతికే లక్షలాది మందికి ఉపాధి పోతుంది.
ఆంధ్రలోనూ థియేటర్ల పై ఆధారపడ్డ వేలాదిమంది బతుకు ఆగమవుతుంది.

నాకు, మీకు గొడవ ఉంటే నా సినిమాల ఆపేయండి.ఓ సన్నాసి మంత్రి చిరంజీవితో సోదరభావన ఉంది అంటున్నాడు.ఉపయోగపడని సోదర భావన ఎందుకు ఆ సన్నాసికి చెప్పండి.
మీకు కోపం ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయండి చిత్ర పరిశ్రమను ఏం చేయొద్దని.వైసీపీ ఇంత దారుణమైన మోహన్ బాబు ప్రభుత్వం తో మాట్లాడాలి అని ఇప్పుడు థియేటర్ లో టికెట్లు గురించి మాట్లాడుకుంటే రేపు విద్యానికేతన్ అడ్మిషన్లు కూడా గవర్నమెంట్ చేస్తుందన్నారు.
గుండాలకు భయపెడితే మనం బతకలేం.మాలో మాకు బేధాభిప్రాయాలు ఉంటాయి.కానీ సినిమా పరిశ్రమ దగ్గరకు వచ్చే సరికి అందరం ఒక్కటేనని అన్నారు.