ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వాడే బంతి ధర తెలిస్తే అవాక్కవుతారు!

ఈ ప్రపంచంలో ఎన్ని క్రీడలున్నా అందులో క్రికెట్‌ చాలా ప్రత్యేకమైనది.ఈ ఆట విషయంలో ఎన్ని విమర్శలున్నా జనాల హృదయాలను గెలుచుకున్న క్రీడ ఇది.

అందువలన క్రికెట్ గురించి తెలియని ప్రజలు ఇక్కడ ఉండనే వుండరు అని చెప్పుకోవాలి.ఇక్కడ చిన్నపిల్లల్ని అడిగినా క్రికెట్ నియమనిబంధనలను గురించి పొల్లు పోకుండా చెప్పేస్తారు.

ఈ క్రీడ ప్రధానంగా నేడు 3 ఫార్మాట్లలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసందే.అవి టెస్ట్, ODI మరియు T20.

టెస్ట్ ఫార్మాట్‌లో, 5 రోజుల మ్యాచ్‌లో 2-2 ఇన్నింగ్స్‌లు, వన్డేలో 1-1 ఇన్నింగ్స్‌లు, T20 మ్యాచ్ గరిష్టంగా 20-20 ఓవర్లు అని మనకి కూడా తెలుసు.అయితే మనలో కొంతమందికి క్రికెట్లో ఆడే బంతి గురించి పెద్దగా అవగాహన ఉండదు.

Advertisement

ఇక ఈ ఆటలో ప్రధానంగా రెడ్ బాల్ అనేది ఉపయోగించబడుతుంది.ODI మరియు T20 మ్యాచ్‌లు అయితే వైట్ టర్ఫ్ బాల్‌ ని, టెస్ట్ మ్యాచ్‌లలో డే-నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్‌ను, టెస్ట్ మ్యాచ్‌లో ఎరుపు రంగు, T20 లేదా ODIలో తెల్లటి లెదర్ బాల్ ని వినియోగిస్తారు.

ఇక డే-నైట్ ఫార్మాట్‌లో టెస్టు మ్యాచ్‌లు ఇప్పుడు పింక్ బాల్‌తో ఆడుతున్నారనే విషయం గమనించారా? ఇది 4 ముక్కల లెదర్ బాల్, ఇది 2 ముక్కలకు భిన్నంగా ఉంటుంది.అలాగే దీని ఖర్చు కూడా ఎక్కువే.

కూకబుర్రా యొక్క టర్ఫ్ వైట్ బాల్ సాధారణంగా T20 మరియు ODIలలో వాడబడుతుంది.కొన్ని ప్రదేశాలలో, SG మరియు డ్యూక్ కూడా వినియోగించవచ్చు.అయితే ఈ క్రమంలో బంతి ధర ఎంత అనేది చాలామందికి ఓ డౌట్ ఉంటుంది.

ODIలు మరియు T20 లలో ఉపయోగించే కూకబుర్రా యొక్క టర్ఫ్ వైట్ బాల్ ధర సుమారు 15 వేల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.వివిధ వెబ్‌సైట్లలో దీని ధరలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు కానీ 13 నుండి 17 వేల రూపాయల మధ్య ఉంటుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

అదే రెడ్ లెదర్ బాల్ ధర అయితే 3-4 వేల నుండి మొదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు