టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు మరొక రోజు సమయం మాత్రమే ఉంది.ఈ క్రమంలోనే ఈయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేయడం కోసం మెగా అభిమానులు సిద్ధంగా ఉన్నారు.
సాధారణంగా ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలవుతున్నాయని తెలియగానే పెద్ద ఎత్తున భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తూ రచ్చ చేస్తారు.అలాంటిది వారి పుట్టినరోజు వేడుక అంటే నెలరోజులు ముందు నుంచి అభిమానులు కౌంట్ డౌన్ చేస్తూ వేడుకలను చేయడానికి సిద్ధమవుతారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 వ తేదీ కావడంతో అభిమానుల సైతం ఈయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక మెగా బ్రదర్ నాగబాబు సైతం మెగా ఫ్యాన్స్ కి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పడమే కాకుండా ఆయనే దగ్గరుండి ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల చిరంజీవి ఏ విధమైనటువంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదు.అయితే ఈ ఏడాది మాత్రం ఘనంగా చేయాలని అభిమానులు భావించారు.

ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సమక్షంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.టాలీవుడ్ సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో ఉన్న మెగా అభిమానుల సైతం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈయన పుట్టినరోజు వేడుకల కోసం ఏకంగా ఐదు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదంతా కూడా స్థానికంగా ఉన్న అభిమానులు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
ఇలా భారీగా ఖర్చు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.ఏది ఏమైనా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.