సుమక్క తెలివి మామూలుగా లేదుగా... కృష్ణాష్టమిని కూడా వదల్లేదుగా?

యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ తెరపై వారంలో ఏడు రోజులు ఎంతో బిజీగా గడుపుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ అంటూ పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లను నిర్వహిస్తూ ఉన్నారు.

 Sumakkas Intelligence Is Not Normal Even Krishnashtami Is Not Left Sumakka, Kris-TeluguStop.com

ఇలా వరుస ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్న సుమక్క తెరవెనక కూడా చాలా బిజీగా ఉన్నారు.ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమా షేర్ చేసే వీడియోలు ఎంతో ఫన్నీగా ఉంటాయి.తద్వారా ఈమెకు తక్కువ సంఖ్యలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు పెరిగి పోయారు.

షూటింగ్ లొకేషన్లో ఎవరు ఏం చేస్తుంటారు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాల గురించి సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.ఇదిలా ఉండగా తాజాగా కృష్ణాష్టమి వేడుకలను కూడా సుమ ఎంతో తెలివిగా తనకు సానుకూలంగా మార్చుకున్నారు.

కృష్ణాష్టమి అంటేనే ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉన్న చిన్నారులను రాధాకృష్ణులుగా అలంకరించి ఎంతో అందంగా తయారు చేస్తుంటారు.ఈ క్రమంలోనే సుమ మీ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడిని రాధా వీడియోలను నాకు పంపిస్తే వాటిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తా అంటూ చెప్పుకొచ్చారు.

సుమ ఈ విధంగా చెప్పేసరికి పెద్ద ఎత్తున ఆమెకు ఎంతోమంది తమ చిన్నారులు వేసిన రాధాకృష్ణుల వేషానికి సంబంధించిన వీడియోలను పంపించారు.

ఇక ఈ వీడియోలు చూసిన సుమ యధావిధిగా ఆ వీడియోల పై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ కామెంట్ చేశారు.ఇకపోతే ఎన్నో వీడియోలు రావడంతో వాటిలో చాలా తక్కువ నిడివి ఉన్న వీడియోలను సెలెక్ట్ చేసుకుని సుమ ఒక వీడియోగా తయారు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సుమా కోసం వీడియోలు పంపిన ఎంతోమంది తల్లిదండ్రులు మా వీడియో ఉందో లేదో అని చూడటమే కాకుండా ఆ వీడియోలో తమ పిల్లల ఫోటోలు కనుక ఉంటే మరి వాటిని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.మొత్తానికి సుమక్క తన స్ట్రాటజీ ఉపయోగించి తన వీడియో ఎక్కువమంది చూస్తూ, తను లాభపడేలా ప్లాన్ చేసిందని చెప్పాలి.

ఏది ఏమైనా ఇలాంటి ఆలోచనలు చేయడంలో సుమక్క తర్వాతే ఎవరైనా అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube