Rohini : షో చేయకు మళ్లీ హాస్పిటల్ పాలవుతావు.. రోహిణి వీడియోపై ట్రోల్స్?

గత కొన్ని రోజుల కిందట బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి( Rohini ) కాళ్ల ఫ్రాక్చర్ తో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.అయిన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపించింది.

 If You Dont Do The Show You Will Be Hospitalized Again Trolls On Rohinis Video-TeluguStop.com

తనకు జరిగిన విషయాలు మొత్తం చెప్పుకొచ్చింది.అంతేకాదు కాళ్లకు పెద్ద కట్టు కట్టిన కూడా రీల్స్ చేసిందంటే తను ఎంత ముదురో అర్థమవుతుంది.

నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరైనా కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకుంటారు.పైగా కాళ్ళు కాబట్టి మరి కొంతకాలం టైం తీసుకోవాల్సి వస్తుంది.

కానీ ఇక్కడ రోహిణి హాస్పిటల్ బెడ్ పైనే రీల్స్ చేయగా జనాలు ఆమెపై బాగా ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా మరోసారి షో చేయటంతో మరోసారి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఇంతకు తను చేసిన షో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.బుల్లితెర ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది రోహిణి.

మొదట్లో సీరియల్స్ లో నటించింది.అందులో తను నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ వంటి సీరియల్స్ లో కూడా నటించింది.అంతేకాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.

బిగ్ బాస్( Bigg boss ) తర్వాత రోహిణి జబర్దస్త్ లో బాగా బిజీగా మారింది.లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్వించింది.జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది.రీసెంట్ గా ద సేవ్ టైగర్స్ అనే సిరీస్ కూడా చేయగా అందులో తన పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.ప్రతిది వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.అయితే కొన్ని సంవత్సరాల కిందట తనకు యాక్సిడెంట్ అవ్వగా తన కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడంతో రాడ్ వేశారు.

అలా ఐదేళ్ల తర్వాత ఆ రాడ్ తీయించుకోవటానికి హాస్పిటల్ కి వెళ్ళగా అది ఫెయిల్ అవ్వడంతో తన కాళ్లకు సర్జరీ చేశారు.

ఆ సమయంలో తను కాళ్ళ నొప్పితో చాలా బాధపడిన విషయాన్ని కూడా సోషల్ మీడియా( Social media ) ద్వారా పంచుకుంది.దీంతో అందరూ కొన్ని రోజులు షూటింగులు పక్కకు పెట్టి రెస్ట్ తీసుకోమని తెలిపారు.

కానీ తను మాత్రం ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్లీ యధావిధిగా షూట్ లలో పాల్గొంటుంది.పైగా డాన్స్ రీల్స్ చేస్తుంది.

రీసెంట్గా వీల్ చైర్ లో కూర్చొని షోకు రాగా చాలామంది ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.

అందులో తను జీతెలుగు సంబంధించిన ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నట్లు కనిపించగా అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ తో డాన్స్ చేస్తూ కనిపించింది.దీంతో ఆ వీడియో చూసిన వాళ్లంతా.

నీ డ్రెస్ బాగుందిలే అబ్బా.మళ్లీ అంతలా తిరుగుతున్నావు కింద పడితే తానా తందానా అని కామెంట్ చేయగా.

మరో నెటిజన్ రోహిణి బేట షో చేయకు మళ్ళీ హాస్పిటల్ పాలవుతావు అంటూ సరదాగా కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆమె వీడియోతో పాటు ట్రోల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube