ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే.. అదృష్టం మీవెంటే..!

మనకు ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలి.అటువంటి అదృష్టం కలిసి రావాలంటే కొన్నిటిని ఇంట్లో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అనుగ్రహం కలిగించే వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.వాటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని, దానివల్ల అదృష్టాన్ని కలిగిస్తాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.

నమ్మకం జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.కష్టపడితే ఫలితం వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు.మరి అటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొత్త సంవత్సరం వస్తే ఏదో ఒకటి కొనడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది.కొత్త ఇంటిలోకి ఏమేమి కొనాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.

ఏవి ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందో అని కూడా ఆలోచించేవారు కూడా ఉన్నారు.

కొబ్బరిని తెచ్చుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు.ఎందుకంటే పచ్చికొబ్బరి లేదా కొబ్బరి బొండం( coconut ) ఏదైనా సరే లక్ష్మి దేవికి ఎంతో ఇష్టం.అందుకే మన పూజలో కొబ్బరికాయ, కొబ్బరి బొండం ప్రధానంగా ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే చిన్న ఎండు కొబ్బరి ( dry coconut )తీసుకొని దాన్ని పూజలు ఉంచి ఆ తర్వాత దానిని డబ్బు దాచే చోట ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్18, శుక్రవారం 2024

ఇంకా చెప్పాలంటే తాబేలు ప్రతిమ( Turtle statue ) సుఖశాంతులకు ప్రతిక అని వాస్తు శాస్త్రం చెబుతోంది.తాబేలు ప్రతిమ ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి ఇంటికి నడిచి వస్తుంది.తాబేలు ప్రతిమ వల్ల ఆలస్యమైన పనులు, పెండింగ్లో ఉన్న పనులు కూడా చకచగా జరిగిపోతాయి.

Advertisement

అలాగే ఇంట్లో నెమలి పింఛం ఉండడం కూడా ఎంతో మంచిది.ఎందుకంటే నెమలి పింఛం శ్రీకృష్ణుడు తలపై ధరించేవాడు.

నెమలి పింఛం ఉన్న చోట లక్ష్మి అమ్మవారు ఉంటారని పండితులు చెబుతున్నారు.అలాగే కొంతమంది ప్రజలు ముత్యపు చిప్ప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.

లక్ష్మీదేవి మెడలో ముత్యాల హారం ఉంటుంది.ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.

ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు.

తాజా వార్తలు