వాము నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఇన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయా..?

మన దేశంలో దాదాపు చాలామంది ప్రజల వంట గదిలో వాము కచ్చితంగా ఉంటుంది.ఇది ఒక రకమైన మసాలా దినుసు.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాముతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు పరగడుపున వాము తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం( Lemon juic ) పిండుకొని తాగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.ఎలాంటి అనారోగ్యాలు దరిచెరువు.

స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చు.శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేసుకోవచ్చు.

Advertisement

ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) కూడా దూరమవుతాయి.ఒకే ఒక చెంచా వాము చాలు ఆరోగ్యాన్ని పూర్తిగా రక్షిస్తుంది.

ప్రతిరోజు పరిగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే మీ బరువు చాలా త్వరగా తగ్గిపోతుంది.దీనివల్ల పీరియడ్స్ సమయంలో తలెత్తే నొప్పులు కూడా దూరమవుతాయి.

మరోవైపు రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది.పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.

వాము( Ajwain ) నిమ్మరసం నీళ్లు రోజు తాగితే శరీరంలోని అన్ని రకాల విషయపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.అంటే ఈ నీళ్లు బెస్ట్ డిటాక్స్ డ్రింక్‌ గా పని చేస్తాయి.రోజు పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే చర్మ సంబంధ సమస్యలు దూరం అవుతాయి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.అదే సమయంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

Advertisement

ఆయుర్వేద శాస్త్రంలో వాముకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.వాములో థయమాల్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి.

ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.రోజు వాము నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల గుండె సంబంధిత రోగాలు దూరం చేసుకోవచ్చు.

రక్తం సరఫరా నియంత్రణలో ఉంటుంది.

తాజా వార్తలు