తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) లో నలుగురు గెలిస్తే ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత( MLC kavitha )కు బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు.