గత కొన్ని నెలల నుంచి తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగింది.ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటినుంచి తెలంగాణలో పరిస్థితులు మారాయి.
ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ ఇంకోవైపు బిజెపి, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలు వారి వారి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచాయి.ఈ సందర్భంలో కేవలం కాంగ్రెస్( Congress ) , బీఆర్ఎస్ మధ్యనే విపరీతమైనటువంటి పోటీ నెలకొన్నది.
ఈ విధంగా 119 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు కొన్ని రోజుల నుంచి ప్రచారంలో మునిగిపోయి ఎంతో కష్టపడ్డారు.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు.
చివరికి నవంబర్ 30వ ఎన్నికలు కూడా జరిగాయి.మరి ఈ ఎన్నికల రిజల్ట్ 3వ తేదీన రానుంది.ఈ తరుణంలోనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అందరికీ ఆసక్తికరంగా మారాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ( Exit polls ) అన్ని సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు మంచి జోష్ లో ఉన్నారు.ఈ సందర్భంలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తే సీఎం ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే కాంగ్రెస్ లో ఈ కీలకమైన లీడర్లు సీఎం రేసులో ఉన్నారు.వారెవరో ఇప్పుడు చూద్దాం.
కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే మాత్రం సీఎం రేసులో ముందుగా ఉండేది రేవంత్ రెడ్డి( Revanth reddy ) .ఆ తర్వాత వరుసలో దళిత కోటాలో బట్టి విక్రమార్క ఉన్నారు.అంతేకాకుండా బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.ఈ నలుగురు నేతలు కీలకంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్నటువంటి జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సీఎం కూర్చిపై కన్నేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బిజెపి పార్టీ బీసీ నినాదంతో కొనసాగుతోంది.ఒకవేళ కాంగ్రెస్ కూడా బీసీని సీఎం చేయాలి అనుకుంటే మాత్రం పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) కి ఎక్కువగా అవకాశం ఉంది.ఒకవేళ ఈ నినాదం లేకుంటే ఈ ఏడుగురు నేతల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.మరి చూద్దాం రిజల్ట్ ఏ విధంగా వస్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది.