బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణా సీఎం ఆయనేనట!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంబందించిన ఆడియో ఒకటి ఇప్పుదు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఇటీవల ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారు అని అంటూ ఒక అభిమాని ఫోన్ కాల్ లో ప్రశ్నిస్తే సమాధానము చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి జంప్ చేసిన రాజగోపాల్ రెడ్డి చేసినట్లు ఒక ఆడియో విడుదల అయ్యింది.ఆ కాల్ లో పార్టీ మారుతున్నారా అని ఒక అభిమాని ప్రశ్నిస్తే, అవును త్వరలో అంటూ సమాధానం ఇచ్చారు.

అయితే ఒకవేళ తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం తానే నంటూ ఆ అభిమాని కి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ఆ ఆడియో లో ఉంది.ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆడియో వైరల్ అవుతున్న సంగతి పక్కన పెడితే బీజేపీ తెలంగాణా అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చారు.ఒకవేళ పదవులకు,పొజీషన్ కు ఆశపడి పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా వారికీ నిరాశ తప్పదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు నిబద్దమైన పార్టీ అని,కుటుంబ పార్టీ కాదని, సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఆడియో కు స్పందనగా ఈ విషయాన్నీ వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు