అంగరంగ వైభవంగా విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు..

భగవంతుడు ఒక్కడే కానీ మనిషి ఆలోచనలో మార్పు ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు.

కౌడిపల్లి లో నల్ల పోచమ్మ, రేణుకా మాత, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఈ ఉత్సవాలలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రంగం పేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Idol Consecration Festivals In Full Glory , Chairman Devender Reddy, Medak Distr

ఆ తర్వాత దేవాలయం వద్ద మూడో రోజు విగ్రహ ప్రతిష్ఠపన, హోమం, తైలాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీధర్ గుప్తా, ఎంపీపీ రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జడ్పిటిసి మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి,అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వైస్‌ చైర్మన్ చిన్నం రెడ్డి, బీఆర్‌ఎస్‌ యూత్ మండలాధ్యక్షుడు కృష్ణ గౌడ్, సర్పంచులు ఈ పుణ్య కార్యక్రమములో పాల్గొన్నారు.

Idol Consecration Festivals In Full Glory , Chairman Devender Reddy, Medak Distr

తూప్రాన్‌ పట్టణ శివారులో వెలసిన కుర్మా నర్సింహ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం గణపతి పూజతో ఘనంగా మొదలయ్యాయి.కూర్మ నరసింహ స్వామి దేవాలయంలో పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, దేవతా హవనం, స్వామి వారికి అభిషేకం, మంటపారాధన, అంకురార్పణ, ధ్వజరోహణ, పంచగవ్వప్రాశన, స్వామివారికి ఆరాధన, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు చేశారు.తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాష్ హాజరై ప్రత్యేక పూజలు కూడా చేశారు.

Advertisement
Idol Consecration Festivals In Full Glory , Chairman Devender Reddy, Medak Distr

ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కృష్ణ పూజారి, అహోబిలం రమణయ్య ఈ పుణ్య కార్యక్రమములో పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు