టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి అందరికీ సుపరిచితమే.కెరీర్ మొదట్లో విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ అనంతరం కుటుంబ కథా చిత్రాలలోను ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న సమయంలో శ్రీకాంత్ సహ నటి ఊహ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.ఇక ఈమెతో పాటు సినిమాలలో నటించిన ఆమని ఇంద్రజ తదితరులు ప్రస్తుతం ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్ కొనసాగిస్తున్నారు.
అయితే ఊహ మాత్రం ఇప్పటివరకు వెండితెరకు దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఊహ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి నోరు విప్పారు.
అయితే ఊహ పెళ్లి అయిన తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.ఇలా వెండితెరకు దూరం అయిన ఆమె ప్రస్తుతం తన పిల్లల భవిష్యత్తు వారి ఎదుగుదల తనకు ముఖ్యమని అందుకే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు.
ఇకపోతే తనకు ఒకే ఒక కోరిక ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు.ప్రస్తుతం శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలోకి తన కొడుకు రోషన్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఫ్యూచర్ లో తన కొడుకు రోషన్ కితల్లి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా తన భర్తతో కలిసి తన కొడుకుకి తల్లిదండ్రుల పాత్రలో నటించాలనే కోరిక ఉందని, ఈ సందర్భంగా ఊహ వెల్లడించారు.ఇక రోషన్ కి తల్లిగా నటించే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే తాను వెండితెరపైకి రీ ఎంట్రీ ఇస్తానని ఈ సందర్భంగా ఊహ తెలియజేశారు.ప్రస్తుతం ఊహ చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే శ్రీకాంత్ ప్రస్తుతం హీరో పాత్రలో కాకుండా హీరోలకు బాబాయ్ పాత్రలలోనూ అలాగే విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.