ఓహియోకు తొలి ఇండో అమెరికన్‌ సెనేటర్‌: నీరజ్ అంటాని ప్రమాణం

అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

గవర్నర్లు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులుగా ఎన్నికవ్వడంతో పాటు వైట్‌హౌస్‌లో కీలక పదవులు చేపడుతూ సత్తా చాటుతున్నారు.

ఈ క్రమంలో ఓహియా రాష్ట్రానికి సెనేటర్‌గా ఎన్నికైన నీరజ్ జె అంటానీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర చరిత్రలో సెనేటర్‌‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా నీరజ్ చరిత్ర సృష్టించారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆయన గతంలో 2014లో ఓహియో హౌస్ 42వ జిల్లాకు ప్రతినిధిగా వ్యవహరించారు.ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వెలిబుచ్చారు.

తాను పుట్టి పెరిగిన సమాజానికి ప్రాతినిధ్యం వహించగలుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.జీవితంలో ప్రతిరోజూ ప్రతి ఒక్క ఓహియోన్ కోసం కష్టపడి పనిచేస్తానని నీరజ్ స్పష్టం చేశారు.

Advertisement

ఈ పదవిలో ఆయన నాలుగేళ్ల పాటు వుంటాడు.అంతకుముందు నీరజ్ తాను ఇన్నేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన హౌస్ ఆఫీస్ ఫోటోను చివరిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

తన సన్నిహితులకు, పరిచయస్తులకు కార్యాలయాన్ని తాను ఎంతగా ప్రేమిస్తానన్న విషయం తెలుసునని నీరజ్ ఆ పోస్ట్‌లో వెల్లడించారు.

ఇక ఓహియో సెనేటర్‌గా అంటానీ నామినేట్ కావడం.అమెరికన్ రాజకీయాల్లో భారత సంతతి చట్టసభ సభ్యుల ఉనికిని పునరుద్ఘాటిస్తుంది.గత నెలలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.

భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్‌ను వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు.డిసెంబర్ 19న వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ప్రెస్ స్టాఫ్ అదనపు సభ్యుల జాబితాను ప్రకటించినప్పుడు పటేల్‌ను ఈ పదవికి బైడెన్ ఎంపిక చేశారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం.ఈ కారణంగానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.

Advertisement

‘సమోసా కాకస్‌’‌గా వ్యవహరించే భారత సంతతి చట్టసభ సభ్యులు ఎన్నికల్లో గెలిచిన సంగతి తెలిసిందే.‘సమోసా కాకస్‌’ సభ్యులైన డాక్టర్‌ అమీ బెరా, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి భారీ ఆధిక్యంతో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఈ బృందంలో ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించిన కమలా హారిస్ కూడా సభ్యురాలే.

తాజా వార్తలు