నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాను... రష్మిక కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నటి రష్మిక మందన్న గురించి అందరికీ సుపరిచితమే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.అలాగే వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 I Am What I Should Be Rashmikas Comments Go Viral, Rashmika's ,comments Go Viral-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఇలా రష్మికపై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

కొంతకాలంగా ఈమె తన గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ఏమాత్రం స్పందించలేదు అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ నెగెటివిటీ కారణంగా తన కుటుంబ సభ్యులకు కూడా బాధపడుతున్నారని ఈ ప్రభావం తన కుటుంబ సభ్యులపై అధికంగా ఉండడంతో ఈమె ఎప్పటికప్పుడు తన గురించి వస్తున్నటువంటి నెగిటివిటీని పూర్తిగా ఖండిస్తున్నారు.గత ఇంటర్వ్యూలలో ఈమె తాను ఏం చేసినా తప్పుగానే భావిస్తున్నారని తాను ఊపిరి తీసుకున్న తీసుకోకపోయినా కూడా తప్పు అన్నట్టు చూపిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు నా నుంచి మీకు వచ్చిన సమస్య ఏంటి నేను ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అంటూ కూడా ఈమె ప్రశ్నించారు.అయితే ఎప్పుడూ కూడా తాను ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఉండాలని అనుకున్నాను.నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో అలాగే ఉంటున్నానని తాజాగా ఈమె తన వర్కౌట్ లకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన వారసుడు మిషన్ మజ్ను సినిమాలు విడుదలయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక త్వరలోనే రష్మిక పుష్ప 2 సినిమా షూటింగులో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube