వివాహేతర సంబంధానికి అడ్డుగు ఉన్నాడని కన్న కొడుకునే చంపిన తల్లి....

ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కాపురాలు చేజేతులారా మహిళలు నాశనం చేసుకుంటున్నారు.

ఎంతలా అంటే తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 9 నెలలు కడుపులో మోసి కన్న కొడుకునే దారుణంగా కడతేర్చి తల్లి అనే పదానికి కళంకం తెచ్చింది ఓ మహిళ.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రాజేంద్ర నగర్ ప్రాంతంలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్నా రు.పెళ్లయిన కొత్తలో దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు.దాంతో పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరికి ఒక కొడుకు జన్మించాడు.

అయితే ఏమైందో ఏమో గానీ ఆ మహిళ వివాహేతర సంబంధం వైపు అడుగులు వేసింది.దాంతో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అయితే ఈమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఆ మహిళ వినేది కాదు.

Advertisement

అంతేగాక వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని తన కన్నా కొడుకైనటువంటి అంజద్ ని గొంతు నులిమి చంపేసింది.

అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.నిందుతురాలిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు  మైలార్ దేవరపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు