హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య..!

ఇటీవలే చిన్న చిన్న కారణాలకే దారుణమైన హత్యలు జరుగుతున్నాయి.

హైదరాబాద్(Hyderabad ) నగర శివారులోని రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్( Attapur ) లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

అర్థరాత్రి నడిరోడ్డుపై జరిగిన ఈ హత్యతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేపింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ టోలిచౌకి లో ఖలీల్(30) ( Khalil )అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఖలీల్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే శుక్రవారం రాత్రి స్నేహితులను కలవడం కోసం ఖలీల్ అత్తాపూర్ వెళ్ళాడు.స్నేహితులంతా కలుసుకొని కాసేపు సరదాగా మాట్లాడుకుని అందరూ మద్యం సేవించారు.

Advertisement

మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాటకు మాట పెరిగి గొడవ మొదలైంది.కాసేపు మాటల యుద్ధం జరిగిన తర్వాత స్నేహితులు కత్తులతో ఘర్షణకు దిగారు.

ఈ ఘర్షణలో ఖలీల్ కు తీవ్ర గాయాలు అవడంతో రక్తపు మడుగులోకి జారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఈ సంఘటన చూసిన స్థానికులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు( Police ) సంఘటనా స్థలానికి చేరుకుని మృతుదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఖలీల్ టోలిచౌకి నుండి అత్తాపూర్ లోని సులేమాన్ నగర్ బస్తికి ఎందుకు వచ్చాడు.

అక్కడ ఎవరెవరిని కలిశాడు.ఈ హత్య అనుకోకుండా జరిగిందా లేదంటే ప్లాన్ ప్రకారం అత్తాపూర్ కి పిలిపించి దారుణ హత్యకు పాల్పడ్డారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. ఆ విషయంలో సీరియస్ అవుతున్న ఫ్యాన్స్!

ఖలీల్ మొబైల్ ఫోన్, చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలు, స్నేహితుల ఆధారంగా త్వరలోనే హత్య కేసును చేదిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు