చిన్న ట్రక్కుపై పెద్ద ఏనుగు తరలింపు.. చిట్టెలుకపై లంబోదరుడి ప్రయాణం అంటే ఇదేనేమో..

ఏనుగులు భారీ ఆకారంతో బాగా బరువుగా ఉంటాయి.ఏ జంతువునైనా ఎత్తుకోవచ్చేమో కానీ, ఏనుగు విషయంలో ఆ పని చేయలేం.

 Huge Elephant Transported In A Big Truck Viral Video Details, Huge Elephant, Tra-TeluguStop.com

అయితే ఏనుగులు జబ్బు పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.చిన్న చిన్న వాహనాలైతే వాటికి సరిపోవు.

అందుకే వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని ట్రక్కులను తయారు చేస్తారు.వాటిలోనే ఏనుగులను వేరే ప్రాంతాలకు తరలిస్తుంటారు.

మన దేశంలో మాత్రం అలాంటివేవీ కనిపించవు.ఎంత పెద్ద ఏనుగునైనా చిన్న వాహనంలో తరలించేస్తుంటారు.

తాజాగా అలా చిన్న ట్రక్కులో పెద్ద ఏనుగును తరలిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

పెద్ద ఏనుగులు 2.5 నుంచి 7 టన్నుల వరకు భారీకాయంతో ఉంటాయి.ఏనుగులను దేవాలయాలలో పెంచుతూ ఉంటారు.

వాటిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగును చిన్న ట్రక్కులో తీసుకెళ్లారు.

ఆ ట్రక్కు కేవలం 2 టన్నుల లోడ్‌ను మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది.అయితే సుమారు 4 టన్నుల బరువు ఉండే ఆ ఏనుగును ఆ చిన్న వాహనంలో తరలించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీనిని చూసిన నెటిజన్లు తమ సందేహాలను వెలిబుచ్చుతూ కామెంట్లు పెడుతున్నారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏకంగా ఆ వాహనం తిరగబడే అవకాశం ఉంది.అయినప్పటికీ చాలా ధైర్యంగా ఆ ట్రక్కు డ్రైవరు, మావటి ఆ ఏనుగును తీసుకెళ్లారు.

వారు చాలా ధైర్యవంతులని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube