"కేజీయఫ్ 2" క్లైమాక్స్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రముఖ భారతీయ భాషల్లో విడుదలై కేజీఎఫ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

తెలుగులో కూడా కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.ప్రస్తుతం యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కేజీఎఫ్ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా క్లైమాక్స్ కోసమే భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా క్లైమాక్స్ కోసమే 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

అయితే బడ్జెట్ తో పోలిస్తే కలెక్షన్లు నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కేజీఎఫ్ 2 సినిమా టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేయగా ఈ సినిమా విడుదలను కూడా వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం.

Advertisement

ఊహించని స్థాయిలో కేజీఎఫ్ ఛాప్టర్ 1 సక్సెస్ కావడంతో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలను దర్శకనిర్మాతలు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం.ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లీష్ లోకి కూడా ఈ సినిమాను అనువాదం చేయనున్నారని సమాచారం.ఈ ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు సౌత్ ఇండియాలో బాహుబలి స్థాయి హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు