ఈ పండు తొక్కను ముఖానికి రాస్తే వద్దన్నా కూడా మీ చర్మం తెల్లగా మారుతుంది!

సాధారణంగా చాలా మంది స్కిన్ వైట్నింగ్( Skin whitening ) కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ముఖ‌ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల క్రీమ్, సీరంలను కొనుగోలు తెగ వాడేస్తూ ఉంటారు.

వీటి కోసం ప్రతి నెల వేల‌కు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

అందుకు డ్రాగన్ ఫ్రూట్ ( Dragon fruit )పీల్ అద్భుతంగా సహాయపడుతుంది.అవును, ఈ పండు తొక్కను ముఖానికి రాస్తే వద్దన్నా కూడా మీ సహాయం తెల్లగా మారుతుంది.

అందుకు ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత డ్రాగ‌న్ ఫ్రూట్ కు ఉన్న‌ పై తొక్కను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రాగన్ ఫ్రూట్ పీల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాష్ చేసిన బియ్యం,( Rice ) మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పల్చటి వస్త్రంలో వేసి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ వండ‌ర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే కొద్దిరోజుల్లోనే మీ చ‌ర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముఖంపై ఏమైనా డార్క్ స్పాట్స్ ( Dark spots )ఉన్నా కూడా మాయం అవుతాయి.స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు