కాఫీ పౌడ‌ర్‌, గుడ్డు క‌లిపి ఇలా చేస్తే జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.. తెలుసా?

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, కాలుష్యం, పోష‌కాల కొర‌త‌, త‌డి జుట్టును దువ్వ‌డం, హెడ్ బాత్ స‌మ‌యంలో చేసే పొర‌పాట్లు, హెయిర్ స్టైలింగ్ టిల్స్‌ను అధికంగా వినియోగించ‌డం, రెగ్యుల‌ర్‌గా త‌ల‌స్నానం చేయ‌డం వంటివి హెయిర్ ఫాల్‌కి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.

హెయిర్ ఫాల్ అనేది దాదాపు అంద‌రినీ వేధించే స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.

స‌రైన ప‌ద్ధ‌తిలో దాన్ని నివారించుకోలేక స‌త‌మ‌తం అవుతున్న వారి సంఖ్య కోట్ల‌లో ఉంది.అలాంటి వారికి ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ సూప‌ర్‌గా హెల్ప్ అవుతుంది.

మ‌రి ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో రెండు ఎగ్స్‌ను బ్రేక్ చేసి వేసి బాగ మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

Advertisement

గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించాలి.అలా చేస్తే జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.

కాఫీ పౌడ‌ర్‌, గుడ్డు.ఈ రెండు మ‌న అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఉండేవే.ఈ రెండూ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ రెండిటిలో ఉండే సుగుణాలు జుట్టు కుద‌ళ్ల‌కు బ‌లాన్ని చేకూర్చి స్ట్రోంగ్‌గా మారుస్తాయి.దాంతో జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

మ‌రియు కాఫీ పౌడ‌ర్‌, గుడ్డు క‌లిపి పైన చెప్పిన విధంగా హెయిర్ మాస్క్‌ను వేసుకుంటే కేశాలు త్వ‌ర‌గా న‌ల్ల‌బ‌డ‌కుండా కూడా ఉంటాయి.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు