జీమెయిల్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే...!

ఈ రోజుల్లో లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూనే ఉన్నారు.బేసిక్ ఫోన్ వాడే ప్రజలు చాలా తక్కువ అయిపోయారు.

అయితే స్మార్ట్ ఫోన్ వాడాలంటే కచ్చితంగా గూగుల్ సంబంధించిన అకౌంట్ ఉండాల్సిందే.అయితే గూగుల్ అకౌంట్ ను మన ఫోన్లో ఉపయోగిస్తున్న సమయంలో అది ఎంత సేఫ్ గా ఉందో లేదో చాలా మందికి తెలియదు.

మన స్మార్ట్ ఫోన్ లో ఏదైనా యాప్స్ వాడికి లాగిన్ అవ్వాలంటే చాలా వాటికి జీ-మెయిల్ యాక్సెస్ అడుగుతుంది.అంతేకాదు ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలన్న కూడా జిమెయిల్ సంబంధించి అకౌంట్ కావాల్సిందే.

అంతేకాదు ఆఫీస్ అవసరాలు కూడా జిమెయిల్ ను చాలా బాగా వాడుతున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల తో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

సైబర్ నేరగాళ్లు ప్రజల యొక్క గూగుల్ అకౌంట్ ను హ్యాక్ చేసి అందులోని సమాచారాన్ని దొంగలిస్తున్నారు.ఇలా హ్యాకింగ్ కు గురి కాకుండా గూగుల్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఇక జిమెయిల్ అకౌంట్ భద్రత కోసం మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకుంటే హ్యాకింగ్ నుంచి కొద్ది వరకు బయటపడవచ్చు.అందుకోసం ముందుగా గూగుల్ అకౌంట్ యొక్క సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకొని 2 వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత గేట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జిమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత ట్రై ఇట్ నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గూగుల్ పంపించిన ఓటిపి ని వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఇక అంతే అలా ఎంటర్ చేసిన తర్వాత మీ 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిపోతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక అప్పటి నుంచి మీ సెల్ ఫోన్ లో కాకుండా ఎక్కడైనా సరే మీకు సంబంధించిన జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఓటీపీ వెరిఫికేషన్ చేశాకే ఆ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు