ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్నారా.. నంబర్ కూడా మరిచిపోయారా.. మళ్లీ ఎలా పొందొచ్చంటే?

ప్రస్తుతం మనకు ఉన్న అన్ని గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్( Aadhaar Card ) అతి ముఖ్యమైనదనే సంగతి తెలిసిందే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ స్కీమ్ బెనిఫిట్స్( scheme benefits ) పొందాలన్నా ఆధార్ కార్డ్ కీలకం కానుంది.

అయితే ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే కొత్త కార్డును పొందే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే సంగతి తెలిసిందే.ఆధార్ కార్డ్ నంబర్ కూడా గుర్తు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్నా ఆధార్ నంబర్ గుర్తుంటే https://uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా డూప్లికేట్ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ వెబ్ సైట్ లింక్ లో ఆర్డర్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ లేదా ఎన్ రోల్ మెంట్ నంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్, వన్ టైమ్ పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ ను పొందవచ్చు.

Advertisement

ఆధార్ నంబర్ గుర్తు లేకపోతే https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uid లింక్ ద్వారా ఆధార్ నంబర్ కావాలో లేక ఎన్ రోల్ మెంట్ నంబర్ కావాలో ఎంచుకుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ( Mobile Number, Email Id ) ఎంటర్ చేసి ఆ తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ లేదా ఎన్ రోల్ మెంట్ నంబర్ ను తెలుసుకోవచ్చు.

రిజిష్టర్డ్ మొబైల్ కు మెసేజ్ రూపంలో ఈ నంబర్ వస్తుంది.

ఈ ఆప్షన్ గురించి సరైన అవగాహన లేని వాళ్లు 1800 180 1947 నంబర్ కు లేదా 011 1947 నంబర్ కు డయల్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ ను తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ను పొందవచ్చు.యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు