ఎండల దెబ్బకు నల్లగా మారిన చర్మాన్ని ఈజీగా ఇలా వైట్ గా, బ్రైట్ గా మార్చుకోండి!

ఎండలు మండిపోతున్నాయి.ఉదయం ప‌ది దాటిన తర్వాత బయట కాలు పెట్టాలంటేనే జనాలు భయపడుతున్నారు.

భానుడి భగభగలకు ఒక్క గంట బయట తిరిగామంటే దెబ్బకు చర్మం నల్లగా మారిపోతుంటుంది.అయితే ఎండల దెబ్బ‌కు నల్లగా మారిన చర్మాన్ని రిపేర్ చేసుకోవడం ఎలాగో తెలియక చాలా మంది తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.

అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ( Simple Remedy )ని పాటిస్తే చాలా సులభంగానే ఎండల వల్ల నల్లగా మారిన చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో( Rice Water ) సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో రైస్ మిల్క్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రైస్ మిల్క్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసుకోవాలి.

చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి హోమ్ మేడ్ సీరం రెడీ అవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న సీరంను ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ సీరం( Serum ) ను వాడటం వల్ల ఎండల దెబ్బ‌కు నల్లగా మారిన చర్మం చాలా వేగంగా రిపేర్ అవుతుంది.స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

Advertisement

చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే మాయం అవుతాయి. క్లియర్ గ్లోయింగ్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు