స్నానం చేసే ముందు బాడీకి ఈ ఆయిల్‌ను రాస్తే స్కిన్ మెరిసిపోతుంది!

ముఖం ఒక్క‌టే అందంగా ఉంటే స‌రిపోదు.శ‌రీరం మొత్తం కూడా అందంగా, ఆరోగ్యంగా మ‌రియు య‌వ్వ‌నంగా మెరిసిపోవాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.

అందుకోస‌మే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఖ‌రీదైన బాడీ లోష‌న్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్‌, క్రీమ్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే, వాటి వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నాలు ఉండ‌క‌పోవ‌చ్చు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌ను స్నానం చేసే ముందు బాడీకి రాస్తే గ‌నుక మీ స్కిన్ ఎల్ల‌ప్పుడూ కాంతి వంతంగా మెరిసిపోతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆయిల్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు ఆరెంజ్ పండ్ల‌ను తీసుకుని.

వాటికున్న తొక్క‌ల‌ను వేరు చేయాలి.ఇప్పుడు ఆ తొక్క‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఎండ‌లో బాగా ఎండ బెట్టుకోవాలి.

Advertisement

ఎండ బెట్టుకున్న ఆరెంజ్‌ పండ్ల తొక్క‌ల‌ను మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె, ఆరెంజ్ తొక్క‌ల పొడి వేసి క‌లిపి రెండు గంటల‌ పాటు వ‌దిలేయాలి.

ఇప్పుడు దీనిని డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హీట్ చేసి చ‌ల్లార బెట్టుకోవాలి.

ఆపై ఆయిల్‌ను మాత్రం ఫీల్ట‌ర్ చేసుకుని బాటిల్‌లో నింపుకోవాలి.స్నానం చేయ‌డానికి గంట ముందు ఈ ఆయిల్‌ను ఒంటికి ప‌ట్టించి స్మూత్‌గా కాసేపు మసాజ్ చేసుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే గ‌నుక చ‌ర్మం ఎప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.మ‌రియు చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు కూడా ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

కాబ‌ట్టి, మార్కెట్‌లో దొరికే ప్రోడెక్ట్స్ కంటే ఇంట్లోనే ఆరెంజ్ ఆయిల్‌ను త‌యారు చేసుకుని వాడ‌టం ఎంతో ఉత్త‌మం.

Advertisement

తాజా వార్తలు