ముఖానికి అందాన్ని ఇచ్చే కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందం పట్ల శ్రద్దను పెడుతున్నారు.అందువల్ల ముఖానికి అందాన్ని ఇచ్చే కనుబొమ్మల విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం.

ప్రతి మహిళా ఒత్తైన కనుబొమ్మలను కావాలని కోరుకుంటుంది.ఎందుకంటే ఒత్తైన కనుబొమ్మలు ఉంటే వయస్సు తక్కువగా కనపడుతుంది.

How To Grow Thick Eyebrows Naturally-How To Grow Thick Eyebrows Naturally-Telugu

కొంత మందికి కనుబొమ్మలు పుట్టుకతోనే ఒత్తుగా ఉంటాయి.మరి కొంత మందికి కనుబొమ్మలు పలుచగా ఉంటాయి.

అటువంటి వారి కోసం ఈ చిట్కాలు ఉల్లిపాయ రసాన్ని తీసుకొని కనుబొమ్మలకు రాసి నాలుగు గంటలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.చేతి వేళ్ళ మీద కొన్ని చుక్కల కొబ్బరి నూనె తీసుకొని కనుబొమ్మల మీద రాసి మసాజ్ చేయాలి.

Advertisement

ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.పచ్చి పాలను కనుబొమ్మలకు రాసి మసాజ్ చేసి 20 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.కలబంద కనుబొమ్మల మంచి షేప్ కి సహాయపడుతుంది.

కలబంద గుజ్జును తీసుకొని కనుబొమ్మల మీద రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కనుబొమ్మలు పెరగటంలో బాగా సహాయపడుతుంది.

గుడ్డు పచ్చసొనను కనుబొమ్మలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఆముదం కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి బాగా సహాయపడుతుంది.కొన్ని చుక్కల ఆముదాన్ని చేతిలోకి తీసుకొని కనుబొమ్మల మీద మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి మంచి ఇంటి చిట్కా నిమ్మరసం.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ముమైత్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలుసా .?

కొంచెం నిమ్మరసం తీసుకొని కనుబొమ్మల మీద రాసి 10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి ఎసెన్సియల్ ఆయిల్స్ కూడా బాగా సహాయపడతాయి.

Advertisement

లెమన్ ఆయిల్, రోజ్ ఆయిల్, లావెండర్ ఆయిల్ వంటివి కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి.వీటిలో మీకు నచ్చిన చిట్కాను ప్రతి రోజు ఫాలో అయితే ఒత్తైన కనుబొమ్మలు మీకు సొంతం అవుతాయి.

తాజా వార్తలు