వేసవి వేడికి తలనొప్పి వేధిస్తుందా? క్షణాల్లో రిలీఫ్ పొందండిలా!

వేసవి కాలం( Summer ) రానే వచ్చింది.ఎండలు భారీగా పెరిగిపోయాయి.

ఎండలు మండి పోతుండడంతో ప్రజలు బయట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.

అయితే వేసవికాలంలో అత్యంత స‌ర్వ‌సాధారణంగా వేధించే సమస్యల్లో తలనొప్పి( Headache ) ఒకటి.

వేసవి వేడికి తలనొప్పి విపరీతంగా వేధిస్తుంటుంది.ఈ తలనొప్పి కారణంగా చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.

ఈ క్రమంలోనే తలనొప్పిని వదిలించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.కానీ సహజంగా కూడా తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

Advertisement

అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మ‌రి తలనొప్పిని తరిమి కొట్టే ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్లు జీలకర్ర ( Cumin ) వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, అంగుళం ఎండిన అల్లం ముక్క, నాలుగు యాలకులు వేసి వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న పదార్థాలను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ నింపుకొని స్టోర్‌ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్‌ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఆపై వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

చివ‌రిగా ఒక గ్లాస్ ఫ్రెష్ పుచ్చకాయ జ్యూస్ వేసి మ‌రోసారి కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్లే.తలనొప్పి విపరీతంగా వేధిస్తున్నప్పుడు ఈ డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.ఎంతటి తలనొప్పి అయినా ఇట్టే మాయం అవుతుంది.

మెద‌డుతో పాటు మ‌న‌సు కూడా ప్ర‌శాంతంగా మారుతుంది.నీర‌సం, అల‌స‌ట ఉన్నా ప‌రార్ అవుతాయి.

తాజా వార్తలు