లిప్‌స్టిక్ లేకున్నా పెద‌వులు ఎర్ర‌గా మెర‌వాలా..ఇలా చేస్తే స‌రి?

పెద‌వులు ఎర్ర‌గా, కాంతివంతంగా ఉంటే.అందం మ‌రింత రెట్టింపు అవుతుంది.

అందుకే పెద‌వుల‌కు లిప్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు.

కానీ, లిప్ స్టిక్‌ను త‌ర‌చూ వాడ‌టం వ‌ల్ల‌.

అందులో ఉండే ప‌లు కెమిక‌ల్స్ పెద‌వుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.ఫ‌లితంగా పెద‌వులు అంద‌హీనంగా మార‌తాయి.

అయితే కొన్ని కొన్ని టిప్స్ ఫాటిస్తే.స‌హ‌జంగానే పెద‌వుల‌ను ఎర్ర‌గా మిల మిలా మెరిపించుకోవ‌చ్చు.

Advertisement

దాంతో లిప్ స్టిక్ వేసుకునే ప‌నే ఉండ‌దు.పైగా పెదవులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

మ‌రి ఈ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుంటే.

అందులో ఒక స్పూన్ కాచి చాల్లార్చిన పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి మ‌రియు అర స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రాన్ని పెద‌వుల‌కు అప్లై చేసి.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తూ ఉంటే.పెదాలు ఎర్ర‌గా, అందంగా మార‌తాయి.

Advertisement

అలాగే ఒక బౌల్‌లో అర స్పూన్ చ‌ప్పున బాదం పొడి, ఓట్స్ పొడి మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు అప్లై చేసి స్క్ర‌బ్ చేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో పెదాల‌కు శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒకసారి చేస్తే.న‌లువు వ‌దిలి పెదాలు ఎర్ర‌గా, కాంతివంతంగా మార‌తాయి.

ఇక బీట్‌రూట్ నుంచి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా మీగ‌డ వేసి బాగా క‌లిపి.

రాత్రి నిద్రించే ముందు పెద‌వుల‌కు అప్లై చేయాలి.ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో మెల్ల మెల్ల‌గా ర‌చ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే.పెదాలు ఎర్ర‌గా మ‌రియు కోమ‌లంగా మారితాయి.

తాజా వార్తలు