రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా గురించి మీకు అందరికీ తెలిసిందేగా.సినిమా ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని నమోదు చేసిన శివ అప్పట్లో యువతను పిచ్చెక్కిలా చేసింది.
శివ సినిమా( Shiva ) కు ముందు ఆ తర్వాత అనే రేంజ్ లో సినిమా ఇండస్ట్రీ ని మార్చింది.ఇప్పుడు అంటే ఈ స్థానాన్ని బాహుబలి లాంటి ఒక సినిమా ఆక్రమించింది.
కానీ ఒకప్పుడు శివ సినిమాకి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి చాలా మంది సైకిల్ చైన్స్ పై ప్రయోగాలు చేశారు.ఈ సినిమాతోనే నాగార్జున సైతం స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు.
రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కొన్ని సినిమాలకే బాలీవుడ్ కి వెళ్ళిపోయేంత స్టార్ డం దక్కించుకున్నాడు ఇంతటి హిట్ సినిమాలో నాగార్జున హీరోగా కాకుంటే ఆ సినిమాను ఊహించగలమా ? అంటే దానికి ఒక చిన్న సంఘటన చెప్తాను.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున మాత్రమే క్రేజీ హీరో కాదు.పైగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటుడు అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఈ శివ సినిమా కనుక పడి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది.శివ సినిమాకి రవితేజ ( Ravi Teja )అయితే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ? ఖచ్చితంగా ఒక మాస్ యాక్షన్ మూవీ గా రవితేజ కెరీర్ కె బిగ్గెస్ట్ హిట్ అయి ఉండేది.అలాగే నాగార్జున కాకుండా రవితేజ అయితే సినిమా చూసే విధానం కూడా ఇంకోలా ఉండేది.అయితే రవితేజ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్న టైం లో రవితేజ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడట.
ఆ టైంలో ఒక సినిమాకి ఆడిషన్ ఇవ్వాలన్నా, లేదంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్లి కలవాలన్నా ముందు ఫోటోలు పంపించడం అలవాటు.

రవితేజ సినిమా ఇండస్ట్రీలో మొదట్లో ఇబ్బందులు పడ్డాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందేగా.అప్పుడు ఫోటో షూట్ చేయించుకోవాలంటే 5 వేలకు పైగా అయ్యేది.అంత డబ్బు లేకపోవడంతో జేబులో తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుని ఆడిషన్ కి వెళ్ళాడట.
అక్కడికి వెళ్లి ఆ ఫోటో ఇచ్చి తనకు అవకాశం ఇవ్వాలని అడిగాడట.అయితే ఆడిషన్ కి వచ్చిన ఎంతోమందిలో రవితేజ కూడా ఒక్కడిగా మిగిలిపోవాల్సి వచ్చింది.కారణం ఏంటంటే తను ఇచ్చిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలో చాలా డీగ్లామరస్ గా కనిపించాడట.దాంతో ఆ ఫోటో పక్కన పడేసి మరో హీరో కోసం వెతుకుతూ ఆడిషన్ చేశారట.
అలా రవితేజ నలుగురిలో ఒకడిగా మిగిలిపోయిన ఈ ఆడిషన్ ద్వారా శివ సినిమాకు ఎంపిక కాలేకపోయాడు.







