జగన్ కు ఎన్ని ఇబ్బందులో ? సిబ్బంది వల్లేనా ?

ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

జగన్ వ్యవహారశలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.

జగన్ నిర్ణయాలపై దూకుడు స్వభావంపై దేశవ్యాప్తంగానే చర్చ నడుస్తోంది.అయినా ఆయన మాత్రం తాను తీసుకున్న నిర్ణయమే అంతిమం, ఎవరు ఏం చెప్పినా తాను వినేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

అయితే జగన్ దూకుడుకు మాత్రం ఎప్పటికప్పుడు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి.వరుసగా జగన్ తీసుకున్న నిర్ణయాలను హైకోర్ట్, సుప్రీం కోర్ట్ తప్పు పడుతూనే ఉన్నాయి.

జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సుప్రీం ఇచ్చిన ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.సరిగ్గా ఇదే సమయంలో మూడు అంశాలకు సంబంధించి హైకోర్టులో వేర్వేరుగా ఇచ్చిన ఆదేశాలు కూడా జగన్ కు ఇదే రకంగా ఇబ్బందులు తెచ్చి పెట్టాయి.అసలు జగన్ కు ఈ తరహా ఇబ్బందులు రావడం వెనక అధికారుల తప్పిదం కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Advertisement

జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయడం వివాదాస్పదం అయింది.దీనిని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది.

అలాగే విశాఖలో పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం ఆరు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు తప్పు పట్టింది.

రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూములు ఎలా తీసుకుంటున్నారు అంటూ కోర్టు తప్పు పట్టింది.అలాగే అమరావతిలో రాజధాని కోసం సేకరించిన భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది.25 లక్షల మందికి పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను కూడా హైకోర్టు తప్పు పట్టింది.అసలు ఇల్లు కట్టుకోవాలని నిబంధన విధించకుండా ఇళ్ల స్థలాలను ఏ విధంగా కేటాయిస్తారు ? వాటిని ఏ విధంగా అమ్ముకోవచ్చని చెబుతున్నారు ? అంటూ హైకోర్టు చివాట్లు పెట్టింది.ఇలా అన్ని విషయాల్లోనూ జగన్ ప్రభుత్వం అబాసుపాలు అవ్వడం వెనుక అధికారుల తప్పిదం బాగా కనిపిస్తోంది.

ప్రభుత్వం అమలు చేసే నిర్ణయాలు కచ్చితంగా నిబంధనలకు లోబడి ఉండేలా వాటిపై ఏ విధమైన వివాదాలు కోర్టు సమస్యలు లేకుండా విధి విధానాలు రూపొందించి సీఎం కు క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది.అధికారులు కానీ, సిఎం జగన్ కానీ ఇవేవీ పట్టించుకోకపోవడంతో ఈ తరహా విమర్శలు, చివాట్లు తినాల్సి వస్తోంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు