వకీల్ సాబ్ లో అనన్య కు అవకాశం ఎలా వచ్చిందంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం వకీల్ సాబ్.పవన్ కళ్యాణ్ మూడున్నరేళ్ల తరువాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.

ఇప్పటికే ట్రైలర్ విడుదలతోనే ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టింది.ఇక ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

How Did Ananya Get The Opportunity In Lawyer Saab, Vakeeel Saab, Actress Ananya

అయితే ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్ లుగా నటించారు.శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల.

ఈ ముగ్గురు హీరోయిన్ లు తెలుగు ప్రేక్షకులకు రకరకాల చిత్రాల ద్వారా పరిచయం ఉంది.కాని ఇందులో కొత్త నటి తెలుగు భామ అనన్య నాగల్ల.

Advertisement

అసలు వకీల్ సాబ్ ముందు వరకు ఈ భామ ఎవరో తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.అయితే ఒక్కసారిగా ఈ అమ్మాయి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా చోటు దక్కించుకునే సరికి ఒక్కసారిగా సినీ పరిశ్రమ దృష్టి అనన్య పడింది.

వకీల్ సాబ్ కంటే ముందు అనన్య మల్లేశం సినిమాలో నటించింది.అయితే ఆ సినిమాలో నటనను చూసి దర్శకుడు వేణు శ్రీరామ్ మూడు సార్లు అడిషన్స్ చేసిన తరువాత అనన్యను కన్ఫర్మ్ చేసాడట దర్శకుడు వేణు శ్రీరాం.

అయితే ఇప్పుడు వకీల్ సాబ్ తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంది.

ఓజీ మూవీతో సుజీత్ సూపర్ సక్సెస్ కొడుతాడా..?
Advertisement

తాజా వార్తలు