చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలు తో హ్యాట్రిక్ విజయాలను తల ఖాతాలో వేసుకుని స్టార్ డం చవి చూసిన హీరో ఉదయ్ కిరణ్. దర్శకుడు తేజ చేతిలో మట్టిలో మాణిక్యంగా ఉదయ్ కిరణ్ నటనలో మెలకువలను నేర్చుకున్నాడు.
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఆ ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితం గురించి.కేవలం చిరంజీవి కూతురు సుస్మిత తో పెళ్లి బ్రేకప్ కావడం కారణంగానే అతని భవిష్యత్తు ముగిసిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అందరూ అంటూ ఉంటారు.
కానీ ప్రేమలో విఫలమైతే చిరంజీవి ఉదయ్ కిరణ్ నీ ఓదార్చేవాడు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు.
అయితే ఇది నిజమే… ఉదయ్ కిరణ్ కి ఒక గాడ్ ఫాదర్ లాగా చిరంజీవి ఉండేవాడు.
మొదట్లో తన సినిమాలన్నీ కూడా హిట్ అవుతుంటే చిరంజీవి ఎంతగానో ప్రోత్సహించేవాడు.అవి మనసంతా నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన రోజులు.ఆ సినిమా హిట్ అవ్వగానే ఉదయ్ అతడు రేంజ్ పెరిగిపోయింది.దాంతో మీడియాలో కూడా ఉదయం బాగా హైలైట్ చేశారు అయితే మనసంతా నువ్వే సినిమా హిట్ అవ్వగానే మొట్టమొదటిసారిగా ఒక మీడియా సంస్థ నుంచి లేడీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది.
ఆ తర్వాత వారి మాటలు కలిసాయి తర్వాత కొన్నాళ్లపాటు వారిద్దరు ఫోన్లో సంభాషించుకునేవారు.ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండానే ప్రేమలో పడ్డారు.
అయితే కొన్నాళ్ల వరకు అంతా బాగానే జరిగిన ఉదయ్ కిరణ్ సదరు జర్నలిస్ట్ తో ఒక మాట ఏదో తప్పుగా అన్నాడని అమే ఉదయ్ కి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది.ఎంత బ్రతుకులాడినా ఆమె అతడిని అంగీకరించలేదు.చివరికి ఇంటికి వెళ్లి ఆ జర్నలిస్టుని, ఆమె తల్లిని కూడా బ్రతిమిలాడుకున్నాడు ఉదయ్ కిరణ్.ఆ బ్రేకప్ తో రెండేళ్ల పాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్లాడట ఆ తర్వాత చిరంజీవి ఎన్నోసార్లు ఆ విషయం మర్చిపోమని సినిమాలపై ఫోకస్ చేయమని ఉదయ్ కిరణ్ ని ప్రోత్సహించేవాడట.
దాంతో మెల్లిగా ఉదయ్ కిరణ్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడట.ఆ తర్వాత ఉదయ్ కిరణ్ పద్ధతులు బాగా నచ్చడంతో సుస్మితతో పెళ్లి విషయం చిరంజీవి ప్రపోజల్ పెట్టాడట ఉదయ్ కిరణ్ కి.