కరెంటు లేకుండా వైద్యం ఎలా జరుగుతుంది?

కరెంట్ లేకుండా వైద్యం ఎట్ల చేస్తరు? ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 నెలల నుంచి విద్యుత్ ఉండదా?అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం గుడిమల్కాపూర్ పర్యటన లో యూపీహెచ్ సీ పరిశీలన ఆసుపత్రి లోని పరిసరాలు వసతుల పై ఆరా.?

 How Can Medicine Be Done Without Electricity ,union Minister Kishan Reddy, Medic-TeluguStop.com

హైదరాబాద్: ప్రైమరి హెల్త్ సెంటర్లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే.అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి.కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.శుక్రవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి, అక్కడి పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని సందర్శించారు.

రోగుల ఇబ్బందులు, వసతుల కొరత, వైద్య సేవల గురించి ఆరా తీశారు.ఆసుపత్రిలో మొత్తం చీకటి ఉండటాన్ని గమనించిన కేంద్ర మంత్రి ఇదేమిటని ప్రశ్నించారు.

మూడు నెలలుగా వైరింగ్ కాలిపోయి కరెంట్ లేక అంధకారంలొనే విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.

ఉన్నతాధికారితో ఫోన్ చేశారు.‘మూడు నెలల నుంచి కరెంట్ లేకుంటే మీరు ఏం చేస్తున్నారు? గర్భిణులు, చిన్న పిల్లల ఇబ్బందులు, డాక్టర్ల కష్టాలు కనిపించడం లేదా? భారత ప్రభుత్వం కూడా పీహెచ్సీలకు డబ్బులు ఇస్తున్నది కదా? ఎందుకు మరమ్మతు చేయించడం లేదు?’ అని ప్రశ్నించారు.అలాంటిదేమీ లేదన్న ఉన్నతాధికారిణి.ఇవ్వాలే పనులు మొదలు పెట్టి కరెంట్ వచ్చేలా చూస్తానన్నారు.డబ్బులు లేకుంటే తన దృష్టికి తీసుకురావాలి కానీ.విధులపట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

అనంతరం పలువురు పేషంట్లు, మహిళలతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube