ఎంత దారుణం.. టీవీ రిమోట్ కోసం అక్క‌తో గొడ‌వ‌ప‌డి ఏకంగా..!

పిల్లల్లో మానసిక పరిపక్వత తీసుకొచ్చేందుకు గురువులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని మానసిక నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు.

క్షణికావేశంలో పిల్లలు తమ ప్రాణాలు తీసేసుకునే విషాద ఘటనలు పెరిగిపోతుండటాన్ని మనం నేటి సమాజంలో గమనించొచ్చు.

ఇందుకు కారణాలు రకరకలుగా ఉన్నప్పటికీ మెయిన్ రీజన్ మెంటల్ స్టెబిలిటీ లేకపోవడమే అని తెలుస్తోంది.ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

టీవీ ప్రోగాం చూడటం కోసం అక్కతో లొల్లి పెట్టుకున్న చెల్లి క్షణికావేశంలో ప్రాణాలు తీసేసుకుంది.వివరాల్లోకెళితే.

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక తన అక్కతో కలిసి ఇంట్లోనే ఉంటోంది.కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైం నుంచే ఇంట్లోనే ఉంటున్నారు.

Advertisement

ఇక ఇటీవల కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ సడలింపులు వచ్చినప్పటికీ స్కూల్స్ ఇంకా ఓపెన్ కాలేదు.ఈ క్రమంలోనే పిల్లలు ఇంట్లోనే హ్యాపీగా గడుపుతున్న విషయం ప్రతీ ఒక్కరికి విదితమే.

ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలో ఓ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలిక తన అక్కతో కలిసి టీవీ చూస్తున్న క్రమంలో తనకు నచ్చిన చానల్ పెట్టాలని అడిగింది.అక్క వినకపోయే సరికి ఆమె దగ్గర నుంచి రిమోట్ లాక్కొని తనకు నచ్చిన పెట్టుకుంది.

ఈ క్రమంలో సదరు బాలిక అక్క ఆమెకు నచ్చిన చానల్ పెట్టడం కుదరదంటూ రిమోట్‌ లాక్కుంది.మేము పెట్టిందే చూడాలని దబాయించింది.అక్కతో గొడవపడిన చెల్లి ఇక అక్కడ నుంచి బెడ్ రూంకు వెళ్లిపోయింది.

గది తలుపులు పెట్టుకుని కిటికీ గ్రిల్స్‌కు తాడు కట్టుకుని ఉరేసుకుని క్షణాల్లోనే ప్రాణాలు తీసుకుంది.బాలిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో సదరు బాలికల నానమ్మకు అనుమానం వచ్చింది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

గది తలుపులు తీయకపోయే సరికి కిటికీలోంచి చూసింది.అప్పటికే ఆమె గ్రిల్స్‌కు వేలాడుతూ కనిపించింది.

Advertisement

వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలవగా వారు డోర్ పగులగొట్టి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు.అయితే, అప్పటికే బాలిక ప్రాణం పోయింది.

ఈ మేరకు బాలిక కుటుంబీకులు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

తాజా వార్తలు