సముద్రంలో గుర్రపు బండ్లు.. చందమామ కథలు కాదండోయ్!

సముద్రంలో పడవలు తిరుగుతాయని, వాటిలో ప్రయాణికులు, సరుకులు దేశాలను దాటిస్తారని మనకు తెలుసు.నీటిపై నడిచే యంత్రంగా పడవలు, ఓడలు మాత్రమే తిరుగుతాయి.

అయితే మహారాష్ట్రలోని అలీబాగ్ బీచ్‌లో మాత్రం గుర్రపు బండ్లు సముద్రంలోకి పర్యాటకులను తీసుకెళ్తూ దర్శనిమిస్తాయి.గతంలో అలీబాగ్‌ సముద్ర తీరంలో కొలాబా అనే కోట ఉండేది.

కాలక్రమంలో సముద్రపు నీరు ముందుకు వచ్చి కోట పూర్తిగా మనుగిపోయింది.దీంతో ఆ ప్రాంతం అంతా చిన్న ద్వీపంలా కనబడుతోంది.

దీంతో అక్కడికి పర్యాటకులను తీసుకెళ్లేందుకు గుర్రపు బండ్లను వినియోగిస్తున్నారు అక్కడి జనం.అయితే ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు పలువురు.సముద్రపు నీరు అప్పుడప్పుడు పెరుగుతుండటంతో గుర్రాలతో పాటు పర్యాటకుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెడుతున్నారని పులువురు విమర్శిస్తున్నారు.

Advertisement

గుర్రపు బండ్లు లోపలికి వెళ్లాక సముద్రం పొంగితే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ గుర్రపు బండ్లకు బదులుగా పడవలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సుకుమార్ ఇక మీదట చేసే మూవీస్ పుష్ప 2 కి మించి సినిమాను చేయాల్సిన అవసరం ఉందా..?
Advertisement

తాజా వార్తలు