మూడు నెలలు విరేచనం కాక బాధపడ్డ వ్యక్తి.. హాస్పిటల్‌కి వెళ్తే పెద్ద షాక్..?

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ విరోచనం సాఫీగా జరగాలి.

మలవిసర్జన నాలుగైదు రోజులకి ఒకసారి మాత్రమే జరుగుతుందంటే అది మలబద్దక సమస్య ( Constipation ) అని పరిగణించవచ్చు.

మలబద్ధకం ఉంటే అనేక ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.ఇంకా చాలానే సమస్యలు ఫేస్ చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది.

అయితే ఒక వ్యక్తి వారం కాదు, రెండు వారాలు కాదు, ఏకంగా మూడు నెలలు మల విసర్జన చేయలేకపోయాడు.వినడానికి ఇది చాలా షాకింగ్ గా అనిపించవచ్చు.

ఇక ఆ పరిస్థితిని అనుభవించిన వ్యక్తి ఎంత భయపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ఈ వ్యక్తికి చికిత్స చేసిన ఒక డాక్టర్ ఆ కేసు గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.ఆ రోగి స్కాన్ రిపోర్ట్‌ను( Scan Report ) రెడిట్‌లో షేర్ చేస్తూ మూడు నెలలు సరిగ్గా మలవిసర్జన చేయని రోగి స్కాన్ ఇది అని వెల్లడించాడు.ఈ వ్యక్తికి చేసిన CT స్కాన్‌లో షాకింగ్ విషయాలు తెలిసాయని తెలిపారు.

అతని కడుపులో ఓ పెద్ద రాయి లాంటి వస్తువు ఉన్నట్లు తాము కనుగొన్నామని పేర్కొన్నారు.ఆ రాయి లాంటి వస్తువు మరేదో కాదని అది మలమే అని ఆయన తెలిపాడు.

చివరిసారిగా విరేచనం ఎప్పుడూ అయింది? అని అడిగితే అతడు మూడు నెలల క్రితం అని చెప్పగానే డాక్టరు ముక్కున వేలేసుకున్నాడట.తర్వాత అతడిని కాపాడారు.

అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు "ఓరి నాయనో ఇతడు ఎలా బతికాడో తమకు అర్థం కావడం లేద"ని పేర్కొన్నారు.తాము ఒక వారం వెళ్లక పోతేనే చచ్చిపోతామని ఇంకొందరు పేర్కొన్నారు.కొంతమంది అతను ఫీకల్ ఇంపాక్షన్( Fecal Impaction ) అనే వ్యాధితో సఫర్ అవుతున్నాడేమో అని అభిప్రాయపడ్డారు.

అమానుషం.. బైక్ కు కుక్కను కట్టేసి ఏకంగా నడిరోడ్డుపై..?
షాకింగ్ వీడియో : బల్లిని తరిమికొట్టాలని స్ప్రే తీసుకెళ్లిన అమ్మాయికి ఏకంగా..?

దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యను వైద్య పరిభాషలో అలా పిలుస్తారు.పరిస్థితి ఉన్నవారు నెలలపాటు మలవిసర్జన చేయలేరు.ఆ వ్యర్థమంతా పురీషనాళంలో పేరుకుపోయి కాలక్రమేణా గట్టిపడుతుంది.

Advertisement

ఇక అది బయటికి రాదు దీనివల్ల చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుంది.సాధారణంగా డాక్టర్లు ఈ గట్టిపడిన మలాన్ని తడిపి బయటికి లాగేస్తారు.

తాజా వార్తలు