ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ ఆయిల్ ను వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ తిరిగొస్తుంది!

మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్( Protein ) ఒకటి.

అయితే ఆరోగ్య పరంగానే కాదు జుట్టు సంరక్షణకు సైతం ప్రోటీన్ ఎంతో అవసరం.

చాలా మంది హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )తో తీవ్రంగా సతమతం అవుతుంటారు.అందుకు ప్రోటీన్ కొరత కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు.

అందుకే డైట్ లో ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.అలాగే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ప్రోటీన్ హెయిర్ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

అలాగే ఊడిన జుట్టు కూడా మళ్లీ తిరిగొస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ హెయిర్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పది బాదం పప్పు, రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు, ఆరు లవంగాలు వేసి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మరియు రెండు స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం కాటన్ క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ఆయిల్ ను తలకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి.

ఈ ప్రోటీన్ హెయిర్ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.కుదుళ్ళు బలోపేతం అవుతాయి.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

జుట్టు ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.పురుషులు కూడా ఈ ఆయిల్ ను ఉపయోగించవచ్చు.

Advertisement

ఈ ఆయిల్ పురుషుల్లో బట్టతల వచ్చే రిస్క్ ను చాలా వరకు తగ్గిస్తుంది.

తాజా వార్తలు