వేస‌విలో వేధించే చెమటకాయల‌కు ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఈ సీజ‌న్‌లో ఎండ‌ల దెబ్బ‌కు నీరసం, అల‌స‌ట‌, చికాకుతో పాటు చెమ‌ట కాయ‌ల స‌మ‌స్య కూడా అత్య‌ధికంగానే ఉంటుంది.

చెమటల‌ వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కార‌ణంగా చెమ‌ట కాయ‌లు ఏర్ప‌డ‌తాయి.వీటి వ‌ల్ల తీవ్ర‌మైన దుర‌దే కాదు.

Home Remedies, Reduce Heat Rashes, Heat Rashes, Latest News, Summer Tips, Summer

చ‌ర్మం కూడా మృదువ‌త్వం కోల్పోతుంది.అందుకే ఈ చెమ‌ట కాల‌య‌ను త‌గ్గించుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.

ర‌క‌ర‌కాల క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే తీవ్రంగా కృంగిపోతుంటారు.

Advertisement

అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులువుగా చెమ‌ట కాయ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా చెమ‌ట కాయ‌ల‌కు చెక్ పెట్ట‌డంలో గంధం పొడి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గంధం పొడి, రోజ్ వాట‌ర్ మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చెమ‌ట కాయ‌లు ఉన్న చోల‌ అప్లై చేసి.

బాగా డ్రై అయిన త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తూ ఉంటే.

క్ర‌మంగా చెమ‌ట కాయ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.అలాగే పాల‌తో కూడా చెమ‌ట కాయ‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
మా ఇంట్లో వారే అలాంటి  పక్షపాతం చూపేవారు... ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ!

చ‌ల్ల‌టి పాల‌లో దూదిని ముంచి చ‌ర్మంపై అప్లై చేయాలి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తూ ఉంటే.ఖ‌చ్చితంగా చెమ‌ట కాయ‌లు మ‌టుమాయం అవుతాయి.

ఇక ఒక బౌల్ తీసుకుని.అందులో ముల్తానీ మ‌ట్టి, చిటికెడు ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై అప్లై చేసి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే.

చెమ‌ట కాయ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

home remedies, reduce heat rashes, heat rashes, latest news, summer tips, summer, skin care, beauty, beauty tips - Telugu Tips, Rashes, Latest, Reduce Rashes, Skin Care