బాలీవుడ్ పై మరో పిడుగు.. ఈసారి హాలీవుడ్ ఎఫెక్ట్?

అంతర్జాతీయ స్థాయిలో బాలీవుడ్ కి ఉన్నటువంటి క్రేజ్ మరి ఏ ఇండస్ట్రీకి ఉండేది కాదు అని చెప్పవచ్చు.అంతేకాదు అసలు మన తెలుగు సినిమాలను అయితే కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా మాత్రమే చూసేవాళ్ళు.

 Hollywood Effect On Bollywood , Hollywood , Bollywood , Tollywood Movies , Dr Strange , Bahubali , Bahubali 2 , Kgf , Kgf 2 , Puspa , Rrr , Jersey , Bollywood Filmmakers , English Cinema-TeluguStop.com

అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ ని సైతం చిత్తు చేస్తూ మన టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేకాదు టాలీవుడ్ సినిమాలు అయిన రోబో.

బాహుబలి.బాహుబలి 2.కేజీఎఫ్.కేజీఎఫ్ 2.పుష్ప.ఆర్ ఆర్ ఆర్ ఇలా కొన్ని సౌత్ సినిమాల జోరు బాలీవుడ్ లో కొనసాగుతూ బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

 Hollywood Effect On Bollywood , Hollywood , Bollywood , Tollywood Movies , Dr Strange , Bahubali , Bahubali 2 , KGF , KGF 2 , Puspa , Rrr , Jersey , Bollywood Filmmakers , English Cinema -బాలీవుడ్ పై మరో పిడుగు.. ఈసారి హాలీవుడ్ ఎఫెక్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు రాబోవు కాలంలో మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము రేపుతూ ఒక ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయం.

Telugu Bahubali, Bollywood, Dr Strange, English, Hollywood, Jersey, Kgf, Puspa, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అదే తరహాకి చెందిన సినిమాలు బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ అక్కడ మన సౌత్ సినిమాల హవా నడవడంతో పాటు అక్కడి ప్రేక్షకులు సౌత్ సినిమాలపైన ఆసక్తి చూపడం గమనార్హం.అయితే ఇటీవల విడుదలైన హిందీ “జెర్సీ” సినిమాకు అక్కడ పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కేజీఎఫ్ 2 రూపంలో ఎంత పెద్ద షాక్ తగిలిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.అంతేకాదు కేజిఎఫ్ 2 కు అక్కడ రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యి సౌత్ సినిమాలపైన తమకు ఉన్న ఆసక్తిని మరోసారి కనబరిచారు అక్కడి సినీ అభిమానులు.

ఇదే తరహాలో ముందుగా విడుదలైన పుష్ప సినిమా ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా లు కూడా బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకున్నాయి.దీనితో బాలీవుడ్ సినిమాలకు ముందు ముందు ఇంకెలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు మన సౌత్ సినిమాలు.

Telugu Bahubali, Bollywood, Dr Strange, English, Hollywood, Jersey, Kgf, Puspa, Tollywood-Telugu Stop Exclusive Top Stories

భారీ సినిమాలను మాత్రమే కాకుండా సౌత్ సినిమాలను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.దాంతో బాలీవుడ్ మేకర్స్ అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతేకాదు సౌత్ సినిమాల రూపంలో దెబ్బమీద దెబ్బ పడుతుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న సమయంలో ఇప్పుడు మళ్ళి బాలీవుడ్ మీద ఇంగ్లీష్ సినిమా దెబ్బ పడబోతుంది.ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

హిందీ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా ఈ హాలీవుడ్ మూవీకే ఎక్కువ బజ్ ఉంది.

Telugu Bahubali, Bollywood, Dr Strange, English, Hollywood, Jersey, Kgf, Puspa, Tollywood-Telugu Stop Exclusive Top Stories

హిందీ డబ్బింగ్ “డాక్టర్ స్ట్రేంజ్” సినిమా ఖచ్చితంగా వంద కోట్ల మూవీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఇతర భాషల సినిమాలు డబ్ అయ్యి అక్కడ వందల కోట్లు సునాయాసంగా సాదిస్తున్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ ఏడాది వచ్చిన హిందీ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే వంద కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించాయి.కాని ఇప్పుడు హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ కూడా వంద కోట్లు రాబడితే ఇక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తమ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అంటూ కామెంట్స్ ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube