ఈ మధ్య మహిళలపై జరుగుతున్న దారుణాలను చూస్తేంటు నింజగానే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.ఇక గ్రామాల్లో అయితే ఈ దారుణాలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి.
ఎందుకంటే అక్కడ పట్టింపులు ఎక్కువగా ఉండటంతో ఇలాంటివి జరుగుతున్నాయి.ఇక ఇప్పుడు కూడా ఓ మహిళపై జరిగిన దారుణం ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది.
అయితే అది జరిగింది కూడా మన తెలంగాణలోనే.మన రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది.
అదేంటంటే హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళపై.
ఈ జిల్లాలోని రాజునాయక్ తండాలో నివాసం ఉంటున్న శంకర్ నాయక్ జూన్ నెలలో హత్యకు గురై చనిపోయాడు.
దీంతో ఆయన బంధువులు తీవ్ర ఆగ్రమంలో ఉంటున్నారు.ఇక ఈ కేసులో నిందితురాలిగా ఉంటున్న ఊరికి చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు.
అయితే ఆమె రీసెంట్ గా బెయిల్ మీద బయటకు వచ్చింది.కాగా ఆమెకు చనిపోయిన శంకర్ నాయక్ కుటుంబానికి మధ్య పాత కక్షలు ఉన్నాయి.
అయితే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన సోదరి ఇంట్లో తల దాచుకుంటోంది.
కాగా రీసెంట్ గా ఆదివారం తమ సొంత ఊళ్లో ఒక బంధువు చనిపోవడంతో ఆమె తప్పక ఆ ఊరికి పరామర్శ కోసం రావాల్సి వచ్చింది.ఇక ఇదే అదునుగా భావించిన మృతుడి కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఆమెపై రెచ్చిపోయారు.ఇక ఆమెను వదిలేది లేదంటూ ఇంట్లో నుంచి ఈడ్చుకుంటూ వచ్చి కళ్లల్లో కారం కొట్టారు.
అక్కడితో ఆగకుండా తీవ్రంగా ఆమెను కొట్టి బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై వివస్త్రను చేశారు.దాదాపు ఒక గంట సేపు ఊరంతా రోడ్డు మీద తిప్పినా కూడా ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు.
దీంతో ఇప్పుడు ఈ దారుణంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.