Himabindu Chaitanya : వరుసకు అక్కాచెల్లెళ్లు.. చెరో 4 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ యువతుల సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

దేశంలో చాలామంది నిరుద్యోగులు ఒక ఉద్యోగం సాధించడానికే ఎన్నో కష్టాలు పడుతున్నారు.

అయితే వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు యువతులు మాత్రం చెరో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

బండి హిమబిందు,( Bandi Himabindu ) కొప్పుల చైతన్య( Koppula Chaitanya ) వరుసకు అక్కాచెల్లెళ్లు కాగా తమ టాలెంట్ తో ప్రభుత్వ పరీక్షలలో ఈ ఇద్దరు యువతులు సత్తా చాటారు.హిమబిందు స్వస్థలం ఖిలా వరంగల్ కాగా కొప్పుల చైతన్య స్వస్థలం గీసుకొండ మండలం ధర్మారం కావడం గమనార్హం.

ఈ ఇద్దరు యువతులు గత సంవత్సరం ఆగష్టులో గురుకుల బోర్డ్ నిర్వహించిన పరీక్షలు రాయడంతో పాటు మే నెలలో ఇంటర్ విద్య బోర్డ్ నిర్వహించిన పరీక్షలకు హాజరు కావడం జరిగింది.ఇటీవల గురుకుల బోర్డ్ ఫలితాలు వెలువడగా ఈ ఇద్దరు యువతులు స్కూల్, జూనియర్, డిగ్రీ విభాగాలలో ఎంపికయ్యారు.

ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ఇంటర్ బోర్డ్ పాలిటెక్నిక్ లెక్చరర్( Polytechnic Lecturer ) పోటీ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసింది.

Advertisement

ఈ ఫలితాలలో చైతన్య, హిమబిందు టాప్ ర్యాంకులు సాధించడం గమనార్హం.హైదరాబాద్ లో చైతన్య, బిందు నియామక పత్రాలను అందుకున్నారు.ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రాగా వీళ్లిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

హిమబిందు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే గురుకుల విద్యాలయానికి ఎంపికయ్యారు.

చైతన్య మాత్రం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయానికి ఎంపిక కావడం గమనార్హం.ఈ కజిన్ సిస్టర్స్ సక్సెస్ స్టోరీ( Cousin Sisters Success Story ) నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఎంతో కష్టపడితే తప్ప వరుసగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సాధ్యం కాదని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

వైరల్ వీడియో : ఎందుకయ్యా ఇలా తయారయ్యారు.. బ్రతికున్న చేపలతో డ్రింక్..
Advertisement

తాజా వార్తలు