ఒకప్పటి హీరో నటుడు నరేష్ గురించి మనందరికీ తెలిసిందే.గత ఏడాది టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు నరేష్( Naresh )వ్యక్తిగత విషయాల విషయంలో సోషల్ మీడియాలో నిలిచారు.
ఆయన నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.తన మూడో భార్య నుంచి విడిపోవడం, పవిత్ర లోకేష్‌తో కలిసి ఉండటం పెద్ద రచ్చ అయ్యింది.
చాలా రోజులు వార్తల్లో వైరల్‌గా మారారు.ఇప్పుడు అన్ని సైలెంట్ అయ్యాయి.
నరేష్ సినిమాల్లో బిజీ అయ్యాడు.ఈ క్రమంలో ఆయన త్వరలో భీమా చిత్రం( Bhimaa )తో రాబోతున్నాడు.
గోపీచంద్ హీరోగా నటించిన మూవీ ఇది.తాజాగా ట్రైలర్ ఈవెంట్ జరిగింది.
ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.ఈ ఈవెంట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ.కుర్రాడిలా రెచ్చిపోయాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చూశాక మాటలు రాలేదని, ఇది మాస్, క్లాస్, చిల్డ్రన్, ఫ్యామిలీ, ఆల్ రౌండ్ ఎంటర్‌టైనర్‌గా అని చెప్పారు.
హీరో గోపీచంద్( Gopichand ), హీరోయిన్లు మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నిర్మాత కెకె రాధామోహన్, దర్శకుడు హర్షలకు అభినందనలు తెలియజేశాడు.ఇందులో నటుడు రఘుబాబు కూడా పాల్గొన్నారు.
దీంతో ఆయన పేరు ప్రస్తావిస్తూ తామిద్దరం క్లాస్ మేట్స్ అని, అంతేకాదు గ్లాస్ మేట్స్ కూడా అంటూ కలిసి నీళ్లు తాగుతామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.భీమా సినిమాలో కొత్త గోపీచంద్‌ని చూస్తారు.
ఒక్కొక్క షాట్ అదిరిపోతుంది.ట్రైలర్‌లో రెండు వేరియేషన్స్ చూశారు.ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్‌గా ఉంటుంది.సినిమాని మార్చి 8న చూసేందుకు వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.తాను ఇప్పటి వరకు ఇలాంటి పాత్రని చేయలేదని, ఎలాంటి పాత్రలు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ దర్శకుడు హర్ష వచ్చాడు.కన్నడలో శివరాజ్ కుమార్‌కి ఫేవరేట్ డైరెక్టర్, అక్కడ సూపర్ హిట్స్ ఇచ్చారు.
ఆయన ఈ పాత్ర నరేషన్ చెప్పగానే ఓకే చెప్పేశానని, ఈ సినిమా చూశాక మీరంతా అంటూ అబ్బాయిలను ఉద్దేశించి నన్ను చూసి కన్నుకొడుతూనే ఉంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈవెంట్‌ని హోరెత్తించారు.
చాలా రోజుల తర్వాత ఆయన పబ్లిక్ ఈవెంట్‌కి రావడంతో ఆడియెన్స్ ఆయన మాట్లాడుతుంటే అరుపులతో రచ్చ రచ్చ చేశారు.